Ayodhya Temple: ఈ నెల 24, 25 తేదీల్లో అయోధ్య రాముడి దర్శనం నిలిపివేత

ఈ నెల 24, 25 తేదీల్లో అయోధ్య రాముడి దర్శనం నిలిపివేత

Ayodhya Temple : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో ఈ నెల 24 సాయంత్రం నుంచి రెండు రోజులపాటు రామ్‌లల్లా దర్శనం ఉండదు. నవంబరు 26 ఉదయం 7.00 గంటలకు దర్శనం పునఃప్రారంభం అవుతుంది. 25న రామమందిర శిఖర ధ్వజారోహణ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసే క్రమంలో భాగంగా రామయ్య (Ayodhya Temple) దర్శనానికి విరామం ఇచ్చామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. వివాహ పంచమి సందర్భంగా ఈ నెల 25న అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణం జరగనుంది. శ్రీరాముడు, సీతమ్మల దివ్య వివాహానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహిస్తారు.

Ayodhya Temple – పూల అందాలకు మెచ్చి రిజర్వ్ ఫారెస్ట్ ను ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడు ప్రభుత్వం ఓ రకమైన మొక్కలను సంరక్షించడానికి కొండ ప్రాంతం మొత్తాన్ని రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించింది. ఎందుకంటే ఆ మొక్కలు తమ జీవితకాలంలో ఒక్కసారే పుష్పిస్తాయి. అదీ.. 8 ఏళ్లకోసారి కావడం విశేషం. నీలగిరి జిల్లా ఊటీ దగ్గర్లో ఉండే గూడలూరులో కురింజి రకం (స్ట్రోబిలాంథెస్‌ సెసిలిస్‌) మొక్కలు ఉంటాయి. వీటికి పూసే పువ్వులను కురింజి అని అంటారు. చూడటానికి ‘గంట’ ఆకృతిలో ఉండే ఈ పూలు ఎక్కువగా ఊదా రంగులో, కొన్ని నీలం, తెలుపు, గులాబీ రంగుల్లో కనిపిస్తుంటాయి. కేవలం నీలగిరిలోనే ఈ తరహాలో 33 రకాలు పుష్పాలు ఉన్నాయి. సెప్టెంబరు-అక్టోబరు సీజన్లలో ఇవి పూస్తుంటాయి. అందుకే గూడలూరు సమీప ప్రాంతాన్ని అక్కడి ప్రభుత్వం అక్టోబరులో రిజర్వ్‌ ఫారెస్ట్‌గా నోటిఫై చేసింది.

Also Read : Red Fort: ఉగ్రవాదుల అసలు టార్గెట్ ఎర్రకోట ?

Leave A Reply

Your Email Id will not be published!