Ayush Badoni : పంజాబ్ కింగ్స్ ఎలెవన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ ఆయుష్ బడోని. లీగ్ మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 257 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 201 పరుగులకు ఆలౌటైంది.
పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు లంక బ్యాటర్లు. ఆరంభం నుంచే అదరగొట్టారు. కైల్ మేయర్స్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 24 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేసి కీలక పాత్ర పోషిస్తే మరో స్టార్ క్రికెటర్ ఆసిస్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ 40 బంతులు ఎదుర్కొని 72 పరుగులతో దంచి కొట్టాడు.
లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ కేఎల్ రాహుల్ తక్కువ స్కోర్ కే పరిమితం కాగా ఆ తర్వాత పరుగుల వరద పారించారు లక్నో బ్యాటర్లు. తాజాగా యంగ్ క్రికెటర్ ఆయుష్ బడోని(Ayush Badoni) దంచి కొట్టాడు. పంజాబ్ కింగ్స్ క్రికెటర్ ఇయాన్ లివింగ్ స్టోన్ తో పోటీ పడ్డాడు.
కేవలం 24 బాల్స్ ఎదుర్కొన్న ఆయుష్ బడోని 42 రన్స్ చేశాడు. ఐపీఎల్ లో రెండో అతి పెద్ద స్కోర్ నమోదదు చేసింది లక్నో సూపర్ జెయింట్స్ . ఆఖరులో వచ్చిన నికోలస్ పూరన్ 19 బంతులు ఎదుర్కొని 45 రన్స్ తో చెలరేగాడు. కగిసో రబాడా 2 వికెట్లు తీశాడు.
Also Read : ఢిల్లీ హైదరాబాద్ నువ్వా నేనా