Ayush Badoni : ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ -2022 లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయుష్ బదానీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
దీంతో ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తో పాటు దిగ్గజ క్రికెటర్లు సైతం బదానీ ఆట తీరును మెచ్చుకుంటున్నారు. ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగింది. ప్రారంభంలోనే లక్నో కీలకమైన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ తరుణంలో ఆయుష్ బదానీ, దీపక్ హూడాతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. గౌరవ ప్రదమైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. బదానీ గుజరాత్ టైటాన్స్ బౌలర్లను అద్బుతంగా ఎదుర్కొన్నాడు.
41 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు రెండు భారీ సిక్సర్లు కొట్టి 54 రన్స్ చేశాడు. హూడా కూడా హాఫ్ సెంచరీతొ మెరిశాడు. ఈ సందర్బంగా మ్యాచ్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు ఆయుష్ బదానీ(Ayush Badoni ).
తన ఆట తీరు మార్చుకునేలా చేయడంలో కీలక పాత్ర గౌతమ్ గంభీర్ పోషించాడంటూ తెలిపాడు. ఆయన ఇచ్చిన సలహాలతో తాను ఆడగలిగానని చెప్పాడు. ఒకరిని అనుకరించడం కంటే నీదైన స్టైల్ లో సహజ సిద్దంగా ఆడమని చెప్పాడని తెలిపాడు బదానీ.
ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ కు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. గతంలో జరిగిన వేలంలో నన్ను తీసుకోలేదు.
కానీ లక్నో ఈసారి ఛాన్స్ ఇచ్చింది. అందుకే ఉపయోగించుకున్నానని చెప్పాడు. తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నాడు.
Also Read : ‘ఆయుష్’ ఆట తీరు అద్భుతం