Babar Azam ICC Award : క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బాబర్
2022కు ప్రకటించిన ఐసీసీ
Babar Azam ICC Award : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్ లో ఒక ఏడాదిలో రెండు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్నాడు. తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. 2022 సంవత్సరానికి గాను బాబర్ ఆజమ్ ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది.
వరుసగా రెండోసారి ఎంపిక కావడం విశేషం. బాబర్ ఆజం తొమ్మిది మ్యాచ్ లలో మూడు సెంచరీలతో 84.87 సగటుతో 679 పరుగులు చేశాడు. అంతే కాకుండా గురువారం బాబర్ ఆజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని అందుకున్నాడు. 54.12 సగటుతో 2, 598 పరుగుల భారీ స్కోర్ చేశాడు.
ఇక క్యాలెండర్ ఇయర్ లో అన్ని ఫార్మాట్ లలో 2,000 పరుగుల అవరోధాన్ని అధిగమించిన ఏకైక ఆటగాడిగా గుర్తింపు పొందాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం. 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021, 2022 సంవత్సరాలకు సంబంధించి ఐసీసీ వన్డే ఫార్మాట్ లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు బాబర్ ఆజం(Babar Azam ICC Award).
28 ఏళ్ల వయస్సు ఉన్న బాబర్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటన్నాడు. మూడు ఫార్మాట్ లలో తనదైన రీతిలో రాణిస్తున్నాడు. దుమ్ము రేపుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో 1,184 రన్స్ సాధించాడు. ఇక వైట్ బాల్ ఫార్మాట్ లలో కెప్టెన్ గా ఏడాదిలో పాకిస్తాన్ పాల్గొన్న మూడు వన్డే సీరీస్ లు గెలుచుకుంది.
ఇక ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్నాడు.
Also Read : పీసీబీ చీఫ్ సెలెక్టర్ గా హరూన్ రషీద్