Balagam 100 Awards : దిల్ రాజు నిర్మాణంలో వేణు యేల్దండి దర్శకత్వంలో వచ్చిన బలగం చిత్రం అరుదైన ఘనతను సాధించింది. అన్ని సినిమాలు 100 రోజులు జరుపుకుంటాయి. 100 సెంటర్లలో రన్ అవుతాయని ప్రకటిస్తాయి. అంతకంటే 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఉన్నాయి. కానీ విడుదలైన కొద్ది కాలంలోనే బలగం అద్భుత రికార్డును నమోదు చేసింది.
ఏకంగా 100 అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఈ విషయాన్ని బుధవారం ట్విట్టర్ వేదికగా బలగం(Balagam) చిత్ర దర్శకుడు వేణు వెల్లడించారు. తెలంగాణలోని ఓ మారుమూల పల్లె లోని కన్నీటి కథను, భావోద్వేగాలను చిత్రీకరించాడు వేణు.
వేణులో ఇంత గొప్ప టాలెంట్ ఉందని ఎవరూ అనుకోలేదు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా గుర్తింపు పొందాడు. కానీ బలగంతో తనలో ఓ అద్భుతమైన డైరెక్టర్ ఉన్నాడని నిరూపించాడు. ఈ చిత్రం విడుదలైన వెంటనే విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆపై కితాబు ఇచ్చారు.
బలగం లాంటి సినిమా మళ్లీ వస్తుందో రాదో అని కొంత మంది దర్శకులు వాపోయారు. తమకు కూడా ఇలాంటి కథ ఎందుకు తలుపు తట్టలేదని కూడా పేర్కొన్నారు. బలగం సినిమా కాదని అది ఓ బతుకు చిత్రమని , వేదనకు ప్రతిరూపమని, ఉద్వేగాలకు ప్రతీక అని స్పష్టం చేశారు. మొత్తంగా వేణు ఇవాళ బలగంతో పాపులర్ అయ్యాడు.
Also Read : Salaar Teaser : రేపే సలార్ టీజర్ రిలీజ్
