‘ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌

మే 8న విడుద‌ల కానున్న చిత్రం

హైదరాబాద్: జో శర్మ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (Motive for Murder)’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలకు సిద్ధ‌మైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “Who is the Killer” పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట తాజాగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఆకట్టుకునే ట్యూన్‌తో, ఎనర్జిటిక్ మ్యూజిక్ ఆండ్ విజువల్స్ ఇప్పటికే మంచి స్పందన పొందుతోంది.

ఈ చిత్రంలో జో శర్మ – సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించి, నిర్మించారు. ఆకట్టుకునే టైటిల్, ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో, M4M ఆసక్తిని పెంచుతోంది. ఈ మూవీ హీరోయిన్, అమెరికన్ నటి జో శర్మ ప్ర‌ముఖ న‌టుడు బాలకృష్ణని కలిసి, చిత్రంలోని పాటను ఆయనకు చూపించారు. విజువల్స్, ప్రెజెంటేషన్‌ను చూసి బాలకృష్ణ చిత్ర యూనిట్‌ని అభినందించారు. అంతే కాకుండా, “ఎవడు వాడు” అనే క్యాచీ లైన్‌ను ఆయన స్వయంగా హమ్ చేశారు.

ఈ సంద‌ర్బంగా జో శర్మ.. బాల‌కృష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. బాల‌కృష్ణ లాంటి ప్ర‌ముఖ న‌టుడిని క‌లిసి ఆశీర్వాదాలు పొంద‌డం సంతోషంగా ఉంద‌ని జో శర్మ తెలిపారు. ఆయ‌న ఆత్మీయంగా ఆహ్వానించి, చిత్ర యూనిట్ అంద‌రికి విషెస్ చెప్పార‌ని, టీమ్‌కి కొత్త‌ ఉత్సాహ‌న్నిచ్చింద‌ని అన్నారు. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, McWin Group USA సహకారంతో రూపొందిన ఈ సినిమా మే 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో 5 భాష‌ల్లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!