Bandi Sanjay : శాంతి భద్రతలు శూన్యం – బండి
బీజేపీ స్టేట్ షాకింగ్ కామెంట్స్
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న హైదరాబాద్ లో ఒకే రోజు 5 హత్యలు చోటు చేసుకున్నాయని, నిన్న సూర్యా పేటలో పట్ట పగలు దారుణ హత్య జరిగిందని మండిపడ్డారు. పోలీసులు నిద్ర పోతున్నారా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో ఈ హత్యలను చూస్తే తెలుస్తుందన్నారు.
ట్విట్టర్ లో పొద్దస్తమానం టైం పాస్ చేసే మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటూ ప్రశ్నించారు. ఆయనకు మరో పేరు కూడా తగిలించారు. అదే ట్విట్టర్ టిల్లు ఏం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్(Bandi Sanjay). అసలు తెలంగాణలో హోం శాఖ మంత్రి ఉన్నారా అన్న అనుమానం నెలకొందన్నారు. ప్రతి శాఖకు మంత్రి ఉన్నా లేనట్టేనని పేర్కొన్నారు.
అందరి మంత్రుల తరపున మంత్రి కేటీఆర్ మాత్రమే మాట్లాడుతారని , సీఎం ఏమైనా అన్ని శాఖలను ఆయనకే అప్పగించారా అని అనుమానం వ్యక్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్. రాష్ట్రంలో చోటు చేసుకున్న వరుస సంఘటనలపై తాము ఎప్పటికప్పుడు తెలంగాణ పోలీస్ బాస్ కు చెప్పినా పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే ఎలా అని ప్రశ్నించారు బండి సంజయ్.
Also Read : Kajol Lust Stories-2 : లస్ట్ స్టోరీస్ 2 హల్ చల్