Tulasi Chandu Support : తుల‌సీ చందుకు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు

యూట్యూబ్ జ‌ర్న‌లిస్టుకు ఫిదా

Tulasi Chandu Support : గ‌త కొంత కాలం నుంచీ జ‌ర్న‌లిస్ట్ తుల‌సీ చందు వార్త‌ల్లో నిలిచారు. ఆమెపై ఎక్కువ‌గా దాడులు కొన‌సాగాయి. వీటిని నిర‌సిస్తూ ఇటీవ‌ల తుల‌సీ చందు ఓ సుదీర్ఘ వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. ప‌లువురు ప్ర‌జాస్వామిక వాదులు , ర‌చ‌యిత‌లు, క‌వులు, క‌ళాకారులు, జ‌ర్న‌లిస్టులు, మేధావులు సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లికారు. ఆమెకు అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌లి కాలంలో అటు ఏపీ ఇటు తెలంగాణ‌తో పాటు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార‌, డిజిట‌ల్ మాధ్య‌మాల వేదిక‌గా ప‌ని చేస్తున్న జ‌ర్న‌లిస్టులపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, దాడులు కొన‌సాగుతూ వ‌స్తున్నాయి.

ప్ర‌ధానంగా తుల‌సీ చందు యూట్యూబ్ ఛాన‌ల్ వేదిక‌గా త‌న వాయిస్ ను వినిపిస్తోంది. ప్ర‌త్యేకించి ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను, స‌మాజంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల‌ను, దేశంలో జ‌రుగుతున్న ఒక సెక్ష‌న్ దాష్టీకాల‌ను ప్ర‌శ్నిస్తోంది. నిల‌దీస్తోంది..వివరించే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీనిని త‌ట్టుకోలేని కొన్ని శ‌క్తులు ఆమెను బెదిరించే స్థాయికి వెళ్లాయి.

దీనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది తుల‌సీ చందు(Tulasi Chandu). ఆపై ప్రెస్ క‌బ్ల్ వేదిక‌గా ఓ స‌దస్సు జ‌రిగింది. సామాజిక మాధ్య‌మాలు దాడుల నేప‌థ్యం గురించి. తాజాగా ప‌లు ప్రాంతాల‌లో తుల‌సీ చందుకు పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. జ‌నం కోసం రాస్తే, వాళ్ల ప‌క్షాన నిల‌బ‌డితే అండ‌గా నిల‌బ‌డతార‌ని దీంతో అర్థ‌మైంది.

Also Read : Bandi Sanjay : శాంతి భ‌ద్ర‌త‌లు శూన్యం – బండి

Leave A Reply

Your Email Id will not be published!