Bandi Sanjay : సీఎం కేసీఆర్ పై బండి కన్నెర్ర
గవర్నర్ వెళితే కానీ వెళ్లని సీఎం
Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఓ వైపు వర్షాలు కురిసి నానా తంటాలు పడుతుంటే పట్టించు కోవాల్సిన సీఎం రాజకీయాల గురించి చర్చించడం దారుణమన్నారు.
ఓ వైపు గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ఎంతో బాధ్యతా యుతంగా వ్యవహరిస్తూ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తుంటే తాను మాత్రం పట్టించు కోలేదని మండిపడ్డారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్ వెళుతుందని తాను కూడా పర్యటనకు వెళ్లారంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్(Bandi Sanjay). భారీ వర్షాలు వరదలతో జనం తల్లడిల్లుతుంటే ఎందుకు ఇప్పటి వరకు పట్టించు కోలేదని ప్రశ్నించారు.
ఉలిక్కి పడ్డ సీఎం ఏరియల్ సర్వేకు బయలు దేరడమంటే ఆయనకు ప్రజలపై ఎలాంటి ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు.
వందలాది గ్రామాలు నీట మునిగి లక్షలాది మంది ఇల్లు కోల్పోయి నిరాశ్రాయులైతే వారిని ఆదుకోవాల్సిన సీఎం సోయి తప్పి పట్టించు కోవడం లేదంటూ ఆరోపించారు.
కేసీఆర్ దివాళాకోరు తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు భారత రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21న ఈ ఎన్నికకు సంబంధించి ఫలితం ప్రకటిస్తారు.
తనకు చేత కాక కేంద్రంపై బురద చల్లే రాజకీయాలు చేయడం దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు. మాయ మాటలు సొల్లు కబుర్లు చెప్పడం మాను కోవాలన్నారు.
ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ అభివృద్ధి చెందుతోందంటూ కేసీఆర్(CM KCR) ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు బీజేపీ చీఫ్ .
Also Read : వరద ప్రాంతాల్లో కేసీఆర్ ఏరియల్ సర్వే