Bandi Sanjay : జగన్ కేసీఆర్ నాటకం సెంటిమెంట్ రాజకీయం
నిప్పులు చెరిగిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
Bandi Sanjay : ఏపీ సీఎం జగన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే. పైకి నాటకాలు ఆడుతున్నరు. వచ్చే ఎన్నికల కోసం మరోసారి సెంటిమెంట్ డ్రామా ఆడుతున్నరు. దీనిని ప్రజలు గమనించాలె. లేక పోతే నష్ట పోతం మరోసారి మోస పోతం అంటూ హెచ్చరించారు భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay).
తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్ లో జరిగింది.ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజయ్యారు. అంతకు ముందు బండి సంజయ్ ప్రసంగించారు. ఆయన ఏపీ, తెలంగాణ సీఎంలను టార్గెట్ చేశారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను బొంద పెట్టిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు.
రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేసిండని దీనిని ఎవరు కట్టాలని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడ్డాడని తాము అధికారంలోకి వస్తే కక్కిస్తామని హెచ్చరించారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని జోష్యం చెప్పారు బండి సంజయ్. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నాడంటూ ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో ఏ వర్గానికీ మేలు చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం స్కాంలలో ఆరి తేరారని మండిపడ్డారు. లాండ్ స్కాం, సాండ్ స్కాం, లిక్కర్ స్కాం, డ్రగ్స్ దందాల్లో టాప్ లో ఉన్నారని ఆరోపించారు బండి సంజయ్(Bandi Sanjay).
తెలంగాణలో ఏం ఒరగ బెట్టిండని బీఆర్ఎస్ పెట్టిండంటూ ప్రశ్నించారు. బిఆర్ఎస్ కాదని అది బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు బండి సంజయ్.
Also Read : కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ దుకాణం