TSPSC GROUP II : త్వ‌ర‌లో గ్రూప్ – 2 నోటిఫికేష‌న్

క‌స‌ర‌త్తు చేస్తున్న టీఎస్పీఎస్సీ

TSPSC GROUP II : ఓ వైపు ముంద‌స్తు ఎన్నిక‌ల ప్రచారం. మ‌రో వైపు నోటిఫికేష‌న్ల హ‌డావుడి. వెంట వెంట‌నే ఆర్థిక శాఖ క్లియ‌రెన్స్. మంత్రులు హ‌రీష్ రావు, కేటీ రామారావు ట్విట్ట‌ర్ లో ఇక చ‌దువుకోండి..ఉద్యోగాలు సంపాదించండి అంటూ ట్వీట్లు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు నోటిఫికేష‌న్లు జారీ చేస్తూ వ‌స్తున్నా ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేయ‌లేదు.

ఏ ఒక్క‌రికీ నియామ‌క ప‌త్రం అంద‌లేదు. ఇక తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్, స‌భ్యుల నియామ‌కంపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన విచార‌ణ‌లో ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. చిన్న ఉద్యోగానికైనా నోటిఫికేష‌న్ జారీ చేస్తార‌ని కానీ ఎంతో కీల‌క‌మైన ఉద్యోగ నియామ‌కాల సంస్థ‌లో స‌భ్యుల‌ను ఎలా ఎంపిక చేశారంటూ ప్ర‌శ్నించింది.

అంతే కాదు పాన్ డ‌బ్బాలో దొరికే ఫామ్ లు నింపారా అంటూ నిల‌దీసింది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వ‌చ్చిన స‌ర్కార్ చివ‌ర‌కు నిరుద్యోగుల ఓట్లు కొల్ల‌గొట్టేందుకు, వారి ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చేందుకు నోటిఫికేష‌న్ల‌ను జారీ చేస్తోందంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

తాజాగా త్వ‌ర‌లో గ్రూప్ 2 నోటిఫికేష‌న్(TSPSC GROUP II) జారీ చేయ‌నున్న‌ట్లు టాక్. టీఎస్పీఎస్సీ చైర్మ‌న్ జ‌నార్ద‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో క‌మిష‌న్ ఇవాళ చ‌ర్చించ‌నున్న‌ట్లు టాక్. 663 పోస్టులు భ‌ర్తీ చేస్తామంటూ ముందుగా ప్ర‌క‌టించారు.

కానీ అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ , జువైన‌ల్ డిస్ట్రిక్ట్ ప్రొబేష‌న్ ఆఫీస‌ర్ , ఏబీసీడ‌బ్ల్యూవో, ఏటీడీబ్ల్యూవో, ఏఎస్ డ‌బ్ల్యూవో పోస్టుల‌ను చేర్చారు. ఈ పోస్టుల‌తో క‌లిపి మ‌రిన్ని పోస్టులు రానున్నాయి. ఈ మేర‌కు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు టాక్.

Also Read : జేఈఈ మెయిన్ నోటిఫికేష‌న్ రిలీజ్

Leave A Reply

Your Email Id will not be published!