Bangladesh Minister Adani : అదానీ పవర్ పై ఆందోళన లేదు
స్పష్టం చేసిన బంగ్లాదేశ్ మంత్రి
Bangladesh Minister Adani : హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ సంక్షోభానికి గురవుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున షేర్లు తగ్గుముఖం పట్టాయి. ఒకరకంగా పెద్ద ఎత్తున భారత్ లో నిరసన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో అదానీ పవర్ గ్రూప్ పలు దేశాలలో పవర్ ను సరఫరా చేస్తోంది. ఇందుకు సంబంధించి బంగ్లాదేశ్ కు కూడా సప్లై చేస్తోంది.
ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరాపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బంగ్లాదేశ్ మంత్రి(Bangladesh Minister). పవర్ సప్లై పై ఎలాంటి ఆందోళన లేదన్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రికి కూడా తెలియ చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది.
జార్ఖండ్ లోని ప్లాంట్ నుండి విద్యుత్ సరఫరా చేయగల అదానీ గ్రూప్ సామర్థ్యం గురించి బంగ్లాదేశ్ కు ఎటువంటి ఆందోళన లేదని ఆ దేశ ప్రధాని ఇంధన సలహాదారు తౌఫిక్ ఇ ఇలాఫి చౌదరి పేర్కొన్నరాఉ. బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ సందర్బంగా మంత్రి హోదాలో ఉన్న ఆయన పాల్గొన్నారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే అదానీ గ్రూప్ తో చర్చలు వ్యక్తిగతమని వాటిని బహిరంగ పర్చలేమని చెప్పారు చౌదరి.
రాబోయేది వేసవి కాలం. రాబోయే కాలమంతా విద్యుత్ తోనే పని ఎక్కువగా ఉంటుందన్నారు మంత్రి. 600 మెగా వాట్ల విద్యుత్ ను సరఫరా చేస్తోంది అదానీ గ్రూప్ అని తెలిపారు. అయితే కొంత ఇబ్బంది కూడా ఉందన్నారు. అదేమిటంటే ఇక్కడి నుంచి బంగ్లాకు తీసుకు వెళ్లే ట్రాన్స్ మిషన్ లైన్ ఇంకా పూర్తి కాలేదన్నారు.
Also Read : అర్జెంటీనా మంత్రితో జై శంకర్ భేటీ