Barrelakka Comment : అంతటా ‘బర్రెలక్క’ ఏమిటా కథ
జనం చూపు కొల్లాపూర్ వైపు
Barrelakka Comment : బర్రెలక్క పేరు విచిత్రంగా ఉంది కదూ. ఇప్పుడు తెలంగాణలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మరారు బర్రెలక్క అలియాస్ శిరీష. తను నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందింది. కడు పేద కుటుంబం. తండ్రి తాగుబోతు. చిన్నప్పుడే వదిలేసి పోయిండు. తల్లితో కలిసి నానా కష్టాలు పడింది. చదువు మీద ఉన్న ప్రేమతో ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ చేసింది. గ్రూప్ -1, గ్రూప్ -2 ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. తనకు పోలీస్ శాఖలో చేరాలని కోరిక. కానీ ఏదీ కాలేక పోయింది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం తెలంగాణలో కొలువు తీరిన రాక్షస, దొరల పాలనేనని అంటోంది ఈ బర్రెలక్క(Barrelakka). ప్రశ్నించడమే నేరంగా మారిన ప్రస్తుత తరుణంలో అదీ నియంతలకు పెట్టింది పేరైన కొల్లాపూర్(Kollapur) నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బరిలోకి దిగింది బర్రెలక్క.
Barrelakka Comment Viral
ఉద్యోగం రాదని నాలుగు బర్రెలను పెట్టుకున్నానంటూ ఆ మధ్యన రీల్ చేసింది. అది కాస్తా వైరల్ అయ్యింది. మెల మెల్లగా సోషల్ మీడియాను షేక్ చేసింది. లక్షలాది మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంకా నిలుస్తూనే ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు , ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు , గాయనీ గాయకులు , సోషల్ మీడియా వారియర్స్ , బహుజన సంఘాలు , లెక్చరర్లు, ప్రొఫెసర్లు బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. తాను నిరుద్యోగుల తరపున బరిలో ఉంటానని ప్రకటించింది. ఈ మేరకు నామినేషన్ దాఖలు చేసింది. ఇవాళ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు బర్రెలక్క. ఇవాళ ఎక్కడ చూసినా బర్రెలక్క(Barrelakka) గురించిన చర్చే జరుగుతోంది. ఒకానొక దశలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుట్టించే స్థాయిలో ప్రస్తుతం ప్రచారం కొనసాగిస్తోంది .
ఇక కొల్లాపూర్ లో 11 సార్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లు శాసన సభ్యులుగా విజయం సాధించారు. ఆమె కు ఇన్ స్టా గ్రామ్ లో అత్యధిక ఫాలోయర్స్ ఉన్నారు. ఇక బర్రెలక్క క్రియేషన్స్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఆమె ఏది మాట్లాడినా సెన్సేషన్. తెలంగాణలో జాబ్ లు రావని అందుకే బర్రెలను పెంచుకుంటున్నానంటూ చేసిన రీల్, వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. బర్రెలక్క దెబ్బకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది. తనపై దాడికి దిగినా తాను వెనక్కి తగ్గేది లేదంటోంది బర్రెలక్క. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. స్వచ్చందంగా ఆమె తరపున ప్రచారం చేస్తున్నారు. యానం నుంచి అల్లాడి కృష్ణారావు ఏకంగా రూ. లక్ష విరాళంగా ప్రకటించారు. గెలిచినా ఓడినా బర్రెలక్క మాత్రం చరిత్ర సృష్టించడం ఖాయమని అంటున్నారు కొల్లాపూర్ ప్రజలు. మరి ఏం జరుగుతుందో చూడాలంటే కొంత కాలం పాటు ఆగాలి.
Also Read : Kapil Dev Comment : కపిల్ ను మించిన దేశ భక్తుడు ఎవరు..?