Bayya Sanny Yadav: నా కుమారుడికి పాకిస్థాన్‌తో సంబంధాల్లేవు – సన్నీయాదవ్ తండ్రి
నా కుమారుడికి పాకిస్థాన్‌తో సంబంధాల్లేవు - సన్నీయాదవ్ తండ్రి
Bayya Sanny Yadav : పాకిస్తాన్ లో పర్యటించిన హైదరాబాదీ యూట్యూబర్ సన్నీ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా… పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తుందన్న ఆరోపణలపై పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో పర్యటించిన మరికొందరు యూట్యూబర్స్ పై కూడా పోలీసులు, కేంద్ర నిఘా సంస్థలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ ను అరెస్ట్ చేసారు. దీనితో తన కుమారుడు, యూట్యూబర్ బయ్య సన్నీయాదవ్‌కు(Bayya Sanny Yadav) పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని అనతి తండ్రి రవియాదవ్ స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి కంటే ముందే సన్నీయాదవ్ దేశానికి వచ్చి వివిధ ప్రాంతాల్లో ఉండాడని తెలిపారు.
Bayya Sanny Yadav Father Comments
పాకిస్థాన్‌లో పర్యటించిన నేపథ్యంలో సన్నీయాదవ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారన్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు పహల్గాం ఉగ్రదాడి కంటే ముందే మనదేశానికి వచ్చాడని, 10 రోజులు నూతనకల్ లో ఉండి చెన్నై వెళ్లినట్లు తెలిపారు. వివిధ దేశాలు తిరిగే క్రమంలో పాకిస్థాన్ కు కూడా వెళ్లాడన్నారు. సోషల్ మీడియాలో, వార్తా పత్రికల్లో అసత్యాలు రాసి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని ఎవరు తీసుకెళ్లారో తమకు ఇంతవరకు తెలియదన్నారు. సన్నీయాదవ్ చెన్నైలో స్నేహితుడి ఇంట్లో ఉంటే తీసుకెళ్లారని, దానికి విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం బాధాకరమన్నారు. తమ కుమారుడి ఆచూకీ కోసం కోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన చెప్పారు.
Also Read : Minister Manohar Lal : కీలక అంశాలపై ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడితో భేటీ..