IPL 2023 Final : అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్
28న నరేంద్ర మోదీ స్టేడియంలో
IPL 2023 Final : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా ప్లే ఆఫ్స్ , ఫైనల్ మ్యాచ్ ల షెడ్యూల్ ను ఖరారు చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). గత ఏడాది 2022లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్(IPL 2023 Final) గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరిగింది. ఫైనల్ లో రాజస్థాన్ రాయల్స్ , గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. తొలిసారిగా ఐపీఎల్ లో చేరిన వెంటనే హార్దిక్ పాండ్యా సారథ్యం లోని గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది.
తాజాగా ఏ జట్లు ఫైనల్ కు చేరుకుంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్లు సత్తా చాటుతున్నా పాయింట్ల పట్టికలో అనూహ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 4వ స్థానంతో సరి పెట్టుకుంది. ఇక టాప్ లో రాజస్థాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తర్వాతి స్థానంలో గుజరాత్ సరి పెట్టుకుంది.
ఐపీఎల్(IPL) లీగ్ లో ఇంకా మ్యాచ్ లు జరగాల్సి ఉన్నాయి. ఇక ఐపీఎల్ కు సంబంధించి ఫ్లే ఆఫ్స్ , ఎలిమినేటర్స్ , ఫైనల్ మ్యాచ్ లు తేదీలను ఖరారు చేసింది. వచ్చే నెల మే 28న గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కాగా ప్రపంచంలోనే అత్యధిక కెపాసిటీ (లక్ష మందికి పైగా ) కలిగిన స్టేడియంగా పేరు పొందింది మోదీ స్టేడియం.
Also Read : ఐపీఎల్ ప్లే ఆఫ్స్..ఫైనల్ షెడ్యూల్