BCCI Womens IPL : 2023లో ఉమెన్స్ ఐపీఎల్ కు శ్రీ‌కారం

షెడ్యూల్ ఖ‌రారు చేసిన బీసీసీఐ

BCCI Womens IPL :  ప్ర‌పంచ క్రికెట్ లో ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) కు ఉన్నంత క్రేజ్ ఇంకే ఏ ఫార్మాట్ కు లేదంటే అతిశ‌యోక్తి కాదు. దానిని దెబ్బ కొట్టాల‌ని ఇత‌ర క్రికెట్ బోర్డులు చూసినా నిరాశే మిగిలింది.

అన్ని దేశాలు బీసీసీఐని ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు వ‌ర‌ల్డ్ లోనే అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌గా ఎదిగింది బీసీసీఐ. ఇప్ప‌టి వ‌ర‌కు పురుషుల ఐపీఎల్ ను మాత్ర‌మే నిర్వ‌హిస్తూ వ‌చ్చింది.

కానీ ఇక నుంచి మ‌హిళ‌ల (ఉమెన్స్ ) కు సంబంధించి ఐపీఎల్(BCCI Womens IPL) ను ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు సౌర‌వ్ గంగూలీ అధ్య‌క్ష‌త‌న బీసీసీఐ పాల‌క వ‌ర్గం పలుమార్లు భేటీ అయ్యింది.

ఇక పురుషుల ఐపీఎల్ కు సంబంధించి 15 సీజ‌న్లు పూర్త‌య్యాయి. వ‌చ్చే ఏడాది 16వ సీజ‌న్ స్టార్ట్ కానుంది. వేల కోట్ల రూపాయ‌లు ఈ రిచ్ లీగ్ ద్వారా బీసీసీఐకి ద‌క్కుతున్నాయి.

2023లో ఉమెన్స్ ఐపీఎల్ చేప‌ట్టేందుక బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఫైన‌ల్ గా నివేదిక త‌యారు చేసే ప‌నిలో ప‌డింది. ఇదిలా ఉండ‌గా పురుషుల ఐపీఎల్ కంటే ముందే ఉమెన్స్ ఐపీఎల్ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది బీసీసీఐ.

కాగా మెన్స్ ఐపీఎల్ లో జ‌ట్ల‌ను కొనుగోలు చేసిన కార్పొరేట్ లు ఉమెన్స్ టీమ్స్ ను కూడా చేజిక్కించుకునేందుకు రెడీగా ఉన్నార‌ని టాక్. ఉమెన్స్ ఐపీఎల్ లో ఆరు ఫ్రాంచైజీలు ఉంటాయి.

ముంబై ఇండియ‌న్స్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ , సీఎస్కే, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫ్రాంచైజీలు ద‌క్కించుకునేందుకు రెడీగా ఉన్నామంటూ ప్ర‌క‌టించాయి.

ఇందుకు సంబంధించి బిడ్ ఏర్పాటుకు బీసీసీఐ మార్గ‌ద‌ర్శ‌కాలు సిద్దం చేసింది. ఇక్క‌డ కూడా మహిళా క్రికెట‌ర్ల‌ను వేలం పాట ద్వారా తీసుకోనున్నారు. ఇక ఉమెన్స్ ఐపీఎల్ 14 రోజుల పాటు జ‌ర‌గ‌నుంది.

Also Read : దాయాదుల పోరుపై పాంటింగ్ కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!