BCCI Selection : కేఎల్ ప్లేస్ లో ఛాన్స్ ఎవరికో
రేసులో నలుగురు క్రికెటర్లు
BCCI Selection : ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆర్సీబీతో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ కేఎల్ రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. తొడకు శస్త్ర చికిత్స చేయాల్సి రావడంతో రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఐపీఎల్ 2023తో పాటు వచ్చే జూన్ 7 నుంచి 15 వరకు ఆస్ట్రేలియాలో ఆసిస్ తో జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ భారత జట్టు తలపడనుంది.
ఇందులో భాగంగా ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)(BCCI Selection) టీమ్ ను ప్రకటించింది. ఇందులో కేఎల్ రాహుల్ ను కూడా ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా తాను గాయపడడంతో, ఆపరేషన్ చేయాల్సి ఉండడం వల్ల కనీసం మూడు నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు స్వయంగా. దీంతో తనంతకు తాను గా ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా ప్రకటించాడు.
కేఎల్ దూరం కానుండడంతో ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది బీసీసీఐ. కేఎల్ రాహుల్ స్థానంలో నలుగురు ఆటగాళ్లను పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో అద్భుతమైన ప్రదర్శన రికార్డు కేరళ స్టార్ సంజూ శాంసన్ పై ఉంది.
కాగా ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శన అడ్డంకిగా మారింది. మరో వైపు శాంసన్ తో పాటు జితేశ్ శర్మ, సందీప్ కిషన్ , సూర్య కుమార్ యాదవ్ , సంజూ శాంసన్ లలో ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి. ఇప్పటి దాకా బీసీసీఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది సంజూ శాంసన్ ను ఎంపిక చేయక పోవడంపై.
Also Read : బెంగళూరుకు ఢిల్లీ బ్రేక్ వేసేనా