IPL Final Guinness Record : ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ గిన్నిస్ రికార్డ్

భారీ ఎత్తున హాజ‌రైన ప్రేక్ష‌కులు

IPL Final Guinness Record : ప్ర‌పంచ క్రికెట్ రంగాన్ని ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) శాసిస్తోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే వ‌ర‌ల్డ్ క్రికెట్ ను బీసీసీఐ ప్ర‌భావితం చేస్తోంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. తాజాగా ప్ర‌తి ఏటా బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఐపీఎల్ అరుదైన ఘ‌న‌త‌ను స్వంతం చేసుకుంది.

అదేమిటంటే వ‌ర‌ల్డ్ లో అత్య‌ధికంగా ప్రేక్ష‌కులు మ్యాచ్ ను చూడ‌డం. ఇందుకు సంబంధించి గిన్నిస్ బుక్ ఆప్ రికార్డ్స్ లో(IPL Final Guinness Record) చోటు ద‌క్కించుకుంది. ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా. ఈ ఏడాది 2022లో ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ స్టేడియంలో జ‌రిగింది.

రెండు జ‌ట్లు ఫైన‌ల్ కు చేరుకున్నాయి. హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్ ను సాధించింది. ర‌న్న‌ర‌ప్ గా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిలిచింది. ఈ ఫైన‌ల్ మ్యాచ్ ను చూసేందుకు ఏకంగా ల‌క్ష మందికి పైగా హాజ‌ర‌య్యారు.

ఇది ఓ రికార్డుగా న‌మోదైంది. మొత్తం 1,01,566 మంది స్టేడియంలో కొలువు తీరారు. గ‌త మే 29న అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ మైదానంలో జ‌రిగింది ఈ మ్యాచ్. ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇంత పెద్ద ఎత్తున ప్రేక్ష‌కులు హాజ‌రు కావ‌డం ఇదే మొద‌టిసారి. ఈ విష‌యాన్ని జే షా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.

అత్య‌ధిక సంఖ్య‌లో ప్రేక్ష‌కులు హాజ‌రైన మ్యాచ్ గా ఇది నిలిచింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డుల‌ను అహ్మ‌దాబాద్ ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ అధిగ‌మించ‌డం విశేషం. గ‌తంలో గ‌తంలో మెల్ బోర్న్ లో 1,00,024 గా ఉండేది. కానీ ఇప్పుడు అహ్మ‌దాబాద్ దానిని తుడిచి వేసింది.

Also Read : ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో ‘శాంస‌న్’ ఫీవ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!