BCCI Rejects : హెచ్సిఏ అభ్యర్థన బీసీసీఐ తిరస్కరణ
వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ను మార్చలేం
BCCI Rejects : భారత్ లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. బీసీసీఐ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇందుకు సంబంధించి దేశంలోని పలు నగరాలను ఎంపిక చేసింది. మ్యాచ్ లు నిర్వహించేందుకు ఆయా క్రికెట్ గ్రౌండ్లను పరిశీలించింది. ఐసీసీ రూల్స్ కు అనుగుణంగా ఉన్న వాటికే ప్రయారిటీ ఇచ్చింది.
BCCI Rejects HCA Request
ఇందుకు సంబంధించి హైదరాబాద్ ను కూడా ఎంపిక చేసింది. అయితే మ్యాచ్ ల షెడ్యూల్ ను మార్చాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ ) బీసీసీకి ప్రతిపాదన పంపించింది. దీనిపై పరిశీలించిన బీసీసీఐ(BCCI) ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేసింది.
ఇప్పటికే మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను పూర్తిగా ఐసీసీకి సమర్పించడం జరిగిందని బీసీసీఐ పేర్కొంది. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పు అంటూ ఉండదని ఈ విషయం హెచ్ సీఏ గుర్తించాలని సూచించింది.
సాధ్యమైనంత మేరకు అన్నింటిని పరిశీలించిన తర్వాతనే షెడ్యూల్ ను ఖరారు చేశామని వెల్లడించింది బీసీసీఐ. ఇక మ్యాచ్ లకు సంబంధించి మార్పులు చేసుకుంటూ పోతే ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టోర్నీని నిర్వహించలేమంటూ సెటైర్ వేసింది.
Also Read : MLA Rekha Nayak Slams : కేసీఆర్ పై రేఖా నాయక్ గుస్సా