BCCI Selection : జోక్ గా మారిన క్రికెట్ జట్టు కెప్టెన్సీ
ఎవరు పర్మినెంట్ గా ఉండని వైనం
BCCI Selection : ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యంత ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పేరొందింది. ఇక్కడ వరకు ఓకే. కానీ గత కొంత కాలం నుంచి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏం చేస్తుందో ఎవరికీ అంతు పట్టడం లేదు.
భారత జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ చేతన్ శర్మ చైర్మన్ గా ఉన్నాడు. మిగతా సెలక్టర్లతో ఎడా పెడా జట్టును ఎంపిక చేయడంలో కంటే ఎక్కువగా మార్పులు చేర్పులు చేస్తున్నది కేవలం కెప్టెన్సీనే.
ఎవరైనా ఆటలో ప్రతిభ కనబరిస్తే ఎంపిక చేస్తారు. ప్రొఫెషనలిజం లేకుండా పోయింది. రాజకీయాలు ఇందులో చోటు చేసుకోవడం వల్లే ఇలా జరుగుతోందంటూ విమర్శలు ఉన్నాయి.
గత రెండేళ్లుగా పూర్తిగా నిరాశ పరుస్తూ వచ్చాడు విరాట్ కోహ్లీ. కానీ అతడిని ఎంపిక చేయడంపై మండి పడ్డారు భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.
విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ భారత జట్టుకు 2021లో రాజీనామా చేసిన తర్వాత ఏడుగురిని మార్చింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ , కేఎల్ రాహుల్ , హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్..ఇలా చెప్పుకుంటూ పోతే మార్చుకుంటూ వెళుతోంది. ఎవరూ భారత జట్టుకు పర్మినెంట్ గా కెప్టెన్ ఇంత వరకు లేక పోవడం దారుణం.
విచిత్రం ఏమిటంటే జింబాబ్వే టూర్ కు ఇప్పటికే కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను ఎంపిక చేసింది బీసీసీఐ(BCCI Selection). తాజాగా శిఖర్ ధావన్ ను తప్పించి కేఎల్ రాహుల్ కు నాయకత్వం అప్పగించింది.
ప్రస్తుతం భారత జట్టు నాయకత్వం ఓ జోక్ గా మారడం విస్తు పోయేలా చేసింది.
Also Read : ఇకనైనా రన్ మెషీన్ రాణిస్తాడా