Sourav Ganguly : బెంగాల్ టైగర్ టార్చ్ బేరర్
సమూల మార్పులకు శ్రీకారం
Sourav Ganguly : సౌరవ్ గంగూలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఓటమిని ఒప్పుకోడు. విజయం సాధించేంత దాకా నిద్రపోడు. ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఇక వెనుదిరిగి చూడడు.
ఇదే అతడి మనస్తత్వం. వంగ భూమి నుంచి వచ్చిన ఈ క్రికెటర్ సాధించిన రికార్డులు ఎన్నో. క్రికెటర్ గా , కెప్టెన్ గా ఆ తర్వాత భారతదేశంలో అత్యున్నత క్రీడా సంస్థకు ప్రెసిడెంట్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.
అస్తవ్యస్తంగా తయారై, రాజకీయాలకు వేదికగా మారిన అత్యధిక ఆదాయం కలిగిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కు ఊహించని రీతిలో చీఫ్ గా ఎన్నికయ్యాడు.
వచ్చీ రావడంతోనే సమూల మార్పులకు శ్రీకారం చుట్టాడు. పూర్తి పారదర్శకత ఉండేలా చేశాడు. మొదటి నుంచీ గంగూలీ(Sourav Ganguly) మనస్తత్వమే అంత. ఎవరితో రాజీ పడడు. ఇంకెవరినీ పట్టించుకోడు.
అందుకే అతడిని పశ్చిమ బెంగాల్ ప్రజలు గ్రేట్ లీడర్ గా పరిగణిస్తారు. అంతే కాదు సౌరవ్ గంగూలీని బెంగాల్ టైగర్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
ఒక రకంగా చెప్పాలంటే బీసీసీఐకి బెంగాల్ నుంచి ఇద్దరు ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చేలా చేశారు. వారిలో దివంగత జగన్ మోహన్ దాల్మియా అయితే ఇంకొరు ప్రస్తుతం బీసీసీఐకి చీఫ్ గా ఉన్న సౌరవ్ గంగూలీ(Sourav Ganguly).
దేశాన్ని తన కంట్రోల్ లో ఉంచుకున్న, ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా స్వయంగా గంగూలీ ఇంటికి వెళ్లాడు. అతడితో భోజనం చేశాడు.
అంటే దాదాకు ఉన్న పవర్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కానీ గంగూలీ మామూలోడు కాదు ఒక రకంగా చెప్పాలంటే టార్చ్ బేరర్.
Also Read : వందేమాతరం క్రికెట్ జపం