Bhagwant Mann : అంగన్వాడీ పోస్టుల భర్తీకి సీఎం ఓకే
6,000 జాబ్స్ భర్తీ చేస్తామన్న భగవంత్ మాన్
Bhagwant Mann : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా 6,000 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ భర్తీ ప్రక్రియను కేవలం 45 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు సీఎం.
ఈ మొత్తం జాబ్స్ ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ (ప్రతిభ) మీద ఆధారంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాఖీ పండగ సందర్భంగా మహిళలకు ఖుష్ కబర్ చెప్పారు.
ఇది తన సోదరీమణులకు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని స్పష్టం చేశారు. భర్తీ ప్రక్రియకు సంబంధించి ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు భగవంత్ మాన్(Bhagwant Mann) .
పంజాబ్ పోలీస్ శాఖ 4,300 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు రానున్న రోజుల్లో నియామక పత్రాలు అందజేస్తామన్నారు సీఎం.
రాష్ట్రంలో మేధో వలసను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ , కాంగ్రెస్ పార్టీల నిర్వాకం కారణంగానే ఇవాళ పంజాబ్ రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టబడిందన్నారు.
తాము వచ్చాక పాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ఇప్పటికే అవినీతి, అక్రమాలకు ఎవరు పాల్పడినా వెంటనే తనకు తెలియ చేయాలన్నారు.
ఇలాంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు. సాధ్యమైనంత వరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జాబ్స్ ను దశల వారీగా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు సీఎం.
Also Read : సల్మాన్ రష్డీపై దాడి బాధాకరం – థరూర్