Bhagwant Mann Comment : జీతే రహో భగవంత్ మాన్
గ్రంధాలయం ఆధునిక దేవాలయం
Bhagwant Mann Comment : పుస్తకాలు లేని గదిని నేను ఊహించ లేను. ఎందుకంటే అది నన్ను మనిషిగా చేసింది. ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం మా నాన్న. ఆయన పంతులు. ఓ టీచర్ కొడుకు సీఎం కావడాన్ని తట్టుకోలేక పోయారు. కానీ గురు గ్రంథ్ సాహెబ్ లో చెప్పబడింది ఒక్కటే. నిన్ను నీవు తెలుసుకో. ఇతరులు ఏం అనుకుంటారో వాళ్లకే వదిలి వేయ్. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేందుకు యత్నించారు. అయినా నేను ఎక్కడా నిరాశకు గురి కాలేదు. నేను పుట్టిన ఈ నేలకు శ్వాస ఉన్నంత వరకు ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చాడు. దీనిని నేను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా. చదువు కోవాలంటే ఎన్నో కష్టాలు పడ్డాను. కాలం అగ్ని పరీక్షకు గురి చేసింది. కానీ కన్నీళ్లను దిగమింగుకున్నా. కానీ ఎక్కడా రాజీ పడలేదు.
ఒంటరిగా ఉన్న సమయంలో నాకు తోడుగా నిలిచింది నా కుటుంబం. మా నాన్న ఒక్కటే చెప్పాడు. ఏది కోల్పోయినా ఆత్మ స్థయిర్యం కోల్పోవద్దని. రాళ్లు వేసే వాళ్లు వేయనీ వాటిని పూలుగా మార్చుకో అని ధైర్యం ఇచ్చాడు. పుస్తకాలు చదవమని చెప్పాడు. అదే నన్ను మార్చేసింది. చివరకు నన్ను మనిషిని చేసింది. అంతులేని ఆవేదనను, నాలోని ప్రతిభను అన్నింటిని ప్రదర్శించే అవకాశం కళ ద్వారా కలిగింది. అదే స్టేజీ ఆర్టిస్టుగా మార్చేసింది. ఇది నా కథే కాదు ప్రతి ఒక్కరి కథ. నేను విజేతగా ఉన్నానని అనుకోవడం లేదు. కానీ ప్రజా సేవకుడినని మాత్రం చెప్పగలను. నాకు ప్రాణం ఇచ్చిన తండ్రి , తల్లితో పాటు ఈ దేశం కోసం ప్రాణాలను తృణ పాయంగా త్యజించిన ధీరుడు, యోధుడు, విప్లవ సేనాని షహీద్ భగత్ సింగ్ అంటే నాకు పంచ ప్రాణం.
నాలాంటి అణగారిన జనం ఎందరో కోట్లాది మంది ఈ దేశంలో ఉన్నారు. వారందరికీ భరోసా కల్పించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంటే గౌరవం. ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగం అన్నది లేక పోయి ఉండి ఉంటే మనువాదం చెలామణి అయ్యేది. నాలాంటి వాళ్లు చట్ట సభల్లోకి వచ్చి ఉండే వారా. లేదు ప్రజల మధ్య ఉన్నాను. ఇలాగే ఉండాలని అనుకుంటున్నా. వాళ్లు ఆశీర్వదించారు. పార్లమెంట్ కు వెళ్లా. ఎమ్మెల్యేగా గెలిపించారు..ఇవాళ సీఎంగా కొలువు తీరా. అందుకే మనుషులు చదువు కోవాలని కోరుకుంటా. విద్య వల్ల వికాసం అలవడుతుంది. అది బతుకు పోరాటంలో ఎదిగేందుకు మార్గం చూపిస్తుంది. ఇవాళ పంజాబ్ లో ప్రతి చోటా గ్రంథాలయాలను నెలకొల్పాలన్నది నా సంకల్పం. ఇది నా ఆశయం కూడా. ఇవాళ దేశంలో ఎక్కడా లేని రీతిలో సుంగ్రూర్ లో భారీ ఖర్చుతో అత్యాధునిక సదుపాయాలతో , మౌలిక వసతులతో , రెస్టారెంట్ లను తలదన్నేలా తీర్చిదిద్దాను. గ్రంథాలయాలను ప్రేమించాలి. వాటిని అక్కున చేర్చుకోవాలి. రోజుకు ఒక్క పుస్తకమైనా చదవాలని పిలుపునిచ్చారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann).
Also Read : Arvind Kejriwal : సత్తా చాటిన విద్యార్థులకు సీఎం కంగ్రాట్స్
