Bhatti Vikramarka : అసైన్డ్ భూములు పంపిణీ చేస్తాం
మల్లు భట్టి విక్రమార్క ప్రకటన
Bhatti Vikramarka : సీఎల్పీ నేత , మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ బలవంతంగా స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూములను తిరిగి పేదలకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
Bhatti Vikramarka Comments on BRS
బీఆర్ఎస్ సర్కార్ ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు. పేదలకు చెందాల్సిన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తాము పవర్ లోకి వచ్చిన వెంటనే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షిస్తామని స్పష్టం చేశారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. పేదలను మోసం చేసిన ఏ ఒక్కరిని విడిచి పెట్టే ప్రసక్తి లేదన్నారు మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). తాను ఇప్పటికీ పలుమార్లు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వచ్చానని అన్నారు.
ఒక్క గజం కూడా వదిలి పెట్ట బోమన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నా ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. సీఎంగా కొలువు తీరిన కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం కావడం దారుణమన్నారు.
ఎన్నికల సందర్బంగా ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు. కేసీఆర్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాబోయే రోజుల్లో మార్పు ఖాయమని జోష్యం చెప్పారు మల్లు భట్టి విక్రమార్క.
Also Read : Smita Sabharwal : ‘ఓనం’లో స్మితా సబర్వాల్