Bhatti Vikramarka : ఖ‌మ్మం స‌భ‌పై ఏం చేద్దాం

భ‌ట్టితో ఠాక్రే..పొంగులేటి భేటీ

Bhatti Vikramarka : రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డానికి సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌ధానంగా టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కొలువు తీరాక సీన్ మారింది. అధికారంలో కొలువు తీరిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ ప్ర‌భుత్వం చేస్తున్న ఆగ‌డాల‌ను ప్ర‌శ్నిస్తోంది..ప్ర‌జ‌ల‌ను చైత‌న్య వంతం చేస్తోంది. అంతే కాదు స‌క‌ల స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తోంది. ఇందులో భాగంగా సీఎల్పీ నేత‌, మ‌ధిర ఎమ్మెల్యే మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పార్టీ త‌ర‌పున ఆదిలాబాద్ నుంచి ఖ‌మ్మం జిల్లా వ‌ర‌కు సుదీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌స్తుతం ఈ యాత్ర చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. కోదాడ‌లో పూర్తి చేసుకుని ఖ‌మ్మం వైపు ప‌రుగులు తీస్తోంది.

ఈ త‌రుణంలో భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర ముగింపుసంద‌ర్భంగా ఖ‌మ్మంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు సీఎల్పీ నేత . ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే తో పాటు ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తో క‌లిసి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌(Bhatti Vikramarka)తో సుదీర్ఘంగా చ‌ర్చించారు. వీరితో పాటు ఏఐసీసీ కార్య‌ద‌ర్శి రోహిత్ చౌద‌రి కూడా ఉన్నారు.

మ‌రో వైపు టీపీసీసీ చీఫ్ ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో భారీ బ‌హిరంగ స‌భ చేప‌ట్టాల‌ని కోర‌డంతో కొంత సందిగ్ఘ‌త నెల‌కొంది. ఇదే స‌మ‌యంలో ఢిల్లీలో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో ఎవ‌రూ కూడా బ‌య‌ట ఎలాంటి కామెంట్స్ చేయొద్దంటూ రాహుల్ గాంధీ ఆదేశించ‌డంతో అంతా గ‌ప్ చుప్ అయ్యారు.

Also Read : Lust Stories 2 Kajol : కామాన్ని తొక్కి పెడితే క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!