Ishitha Shukla Hats Off You : హ్యాట్సాఫ్ ఇషితా శుక్లా

భోజ్ పూరి స్టార్ కూతురు

Ishitha Shukla Hats Off You : ఎవ‌రీ ఇషితా శుక్లా అనుకుంటున్నారా. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా తీసుకు వ‌చ్చిన కొత్త ప‌థ‌కం అగ్నిప‌థ్ లో చేరింది. ఈ అమ్మాయి ఎవ‌రో కాదు. భోజ్ పూరి లో సూప‌ర్ స్టార్ గా పేరు పొందారు గోర‌ఖ్ పూర్ ప్ర‌స్తుత ఎంపీ గా ఉన్న ర‌వి కిష‌న్ కూతురే ఈ ఇషితా శుక్లా. ఆమెకు కేవ‌లం 21 ఏళ్లు మాత్ర‌మే. కానీ చిన్న వ‌య‌సులో ఎవ‌రైనా భ‌ద్ర‌త‌మైన జీవితం కోరుకుంటారు. కానీ ఈ ఎంపీ మాత్రం త‌న కూతురిని దేశం కోసం ప‌ని చేసే అవ‌కాశం కేవ‌లం సైన్యంలో మాత్ర‌మే ఉంటుంద‌ని న‌మ్మారు. ఒక ప్ర‌జా ప్ర‌తినిధిగా ఆయ‌న‌కు ఎనో అవ‌కాశాలు. త‌లుచుకుంటే స‌ర్కార్ ఉద్యోగం ఓ లెక్క కాదు. కానీ త‌ను మాత్రం కూతురి ఇష్టానికే వ‌దిలేశాడు.

చివ‌ర‌కు అగ్నిప‌థ్ స్కీంలో ద‌ర‌ఖాస్తు చేసుకుంది ఇషితా శుక్లా. ఎంపికైంది..ప్ర‌స్తుతం దేశ స‌రిహ‌ద్దులో ప‌హరా కాసేందుకు సిద్ద‌మైంది. చిన్న వ‌య‌స్సు లోనే సేవే చేసేలా ప్రోత్స‌హించిన తండ్రి ర‌వి కిష‌న్(Ravi Kishan) ను ప్ర‌తి ఒక్క‌రు అభినందిస్తున్నారు. ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల‌లో ఇషితా శుక్లా ట్రెండింగ్ లో నిలిచింది. టాప్ లో కొన‌సాగుతోంది.

ఇదిలా ఉండ‌గా అగ్ని ప‌థ్ ప‌థ‌కం భార‌తీయులను ఎయిర్ ఫోర్స్ , నేవీ, ఆర్మీ రంగాల‌లో రిక్రూట్ చేసేందుకు రూపొందించారు. దీని ద్వారా నాలుగు సంవ‌త్స‌రాల పాటు ప‌ని చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆ త‌ర్వాత ప‌ర్ ఫార్మెన్స్ బ‌ట్టి పొడిగించే చాన్స్ ఉంటుంది. కానీ మిగ‌తా వారికి అందే సౌల‌భ్యాలు, సౌక‌ర్యాలు అంద‌వు అగ్నిప‌థ్ ద్వారా ఎంపికైన వారికి.

Also Read : Bhatti Vikramarka : ఖ‌మ్మం స‌భ‌పై ఏం చేద్దాం

Leave A Reply

Your Email Id will not be published!