Bhim Army Chief Comment : యావత్ భారత దేశం ఒక్కసారిగా ఉలికి పాటుకు గురైంది. కారణం చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ అణగారిన వర్గాల గొంతుక కావడమే నేరంగా మారింది. భీమ్ ఆర్మీ చీఫ్ గా ఇప్పటికే గుర్తింపు పొందాడు. ఉన్నట్టుండి యూపీలో ఆజాద్ పై కాల్పులకు తెగబడ్డారు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. ఇంతకీ రావణ్ చేసిన తప్పేంటి. పేదల పక్షాన తన వాయిస్ ను వినిపించాడు. ఆపై దళితులు, నిరుపేదలు, అణగారిన వర్గాల తరపున వకల్తా పుచ్చుకున్నాడు. డిసెంబర్ 3న, 1986లో యూపీలో పుట్టాడు . లా చేశాడు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. ఆపై రాజకీయ పార్టీని స్థాపించాడు. భీమ్ ఆర్మీ(Bhim Army) అనేది అన్యాయంపై యుద్దం చేసే సంస్థ. ప్రత్యేకించి దోపిడీకి గురయ్యే బాధితుల తరపున గొంతును వినిపించేలా చేయడం. గోవర్దన్ దాస్ తండ్రి, కమలేష్ దేవి తల్లి. సామాజిక కార్యకర్తగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అన్నింటికి మించి అంబేద్కరైట్ గా పేరు పొందాడు. భీమ్ ఆర్మీ కో ఫౌండర్ . ప్రస్తుతం కన్వీనర్ గా ఉన్నాడు.
ది గ్రేట్ చామర్స్ ఆఫ్ ఘడ్ ఖౌలీ వెల్ కమ్ యూ అనే హోర్డింగ్ ఏర్పాటు చేశాడు. అది విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో వెలుగులోకి వచ్చాడు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్. ప్రముఖ దళిత నాయకుడిగా ప్రాముఖ్యత సాధించాడు. భీమ్ ఆర్మీ సంస్థ విద్య కోసం పని చేస్తుంది. దళిత హిందువుల విముక్తి కోసం పని చేస్తుంది ప్రధానంగా. ఉత్తర ప్రదేశ్ లో దళితుల కోసం ఉచితంగా బడులను నడుపుతోంది. విద్య ద్వారానే వికాసం కలుగుతుందని నమ్మాడు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్(Chandra Shekhar Azad Ravan). ఇదే సమయంలో తన వాయిస్ ను ప్రజాల పక్షాన వినిపించడంలో సక్సెస్ అయ్యాడు. సీఏఏ వ్యతిరేక నిరసన సందర్భంగా జామా మసీదు వద్ద నిరసన తెలిపాడు. జాతీయ భద్రతా చట్టం కింద రావణ్ అరెస్ట్ అయ్యాడు. అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఒప్పుకోలేదు యూపీ సర్కార్. చివరకు జైలు పాలు చేసింది ఆజాద్ ను. ఇదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రకటించాడు. ఇదే సమయంలో భీమ్ ఆర్మీని అంబేద్కర్ ఆర్మీ పార్టీగా ప్రకటించాడు.
అంతే కాదు ఆర్మీ చీఫ్ సంస్థ 350 కంటే ఎక్కువగా ఉచితంగా పాఠశాలలు నడుపుతోంది. దీనికి అంబేద్కర్ పేరు పెట్టాడు. దళితుల ఆత్మ గౌరవం కోసం తాను పోరాడుతూనే ఉంటానని ప్రకటించాడు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్(Chandra Shekhar Azad Ravan). బహుజనులతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీలను కూడా భాగం అయ్యేలా చేశాడు. బీజేపీకి వ్యతిరేకమని ప్రకటించాడు. మనువాద భావ జాలాన్ని సమూలంగా నాశనం చేయడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశాడు ఆజాద్. 2019లో గురు రవిదాస్ ఆలయాన్ని కూల్చి వేయడాన్ని నిరసిస్తూ ఉద్యమించాడు. 2020న చంద్రశేఖర్ ఆజాద్ సమాజ్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశాడు. మొత్తంగా యూపీలో అగ్రవర్ణాల ఠాకూర్లకు వ్యతిరేకంగా రావణ్ సాగించిన పోరాటం అతడిపై దాడి చేసేలా ఉసి గొల్పిందనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా బాధితుల పక్షాన గొంతును వినిపించే ఆజాద్ చని పోయినా పోరాడుతానని అంటున్నాడు.
Also Read : Rahul Gandhi : అడ్డుకోవడం అప్రజాస్వామికం