Jharkhand CM : జార్ఖండ్ సీఎం సోరేన్ కు బిగ్ షాక్
పొంచి ఉన్న పదవీ గండం
Jharkhand CM : ఇది ఊహించని పరిణామం. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ కారణంగా ఆయన తన కీలకమైన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయే ప్రమాదాని కొని తెచ్చుకున్నారు.
గనుల పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేసింది పార్టీ. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి హేమంత్ సోరేన్ పై పూర్తి ఆధారాలతో నివేదికను సమర్పించింది బీజేపీ.
ఇదిలా ఉండగా హేమంత్ సోరేన్ భవితవ్యం పూర్తిగా సీఈసీ ఇచ్చే నివేదిక మీదే ఆధారపడి ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగా అతి త్వరలోనే రాష్ట్ర గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదే గనుక జరిగితే ప్రభుత్వం పడి పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం , మోదీ త్రయం బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడంలో బిజీగా ఉంది.
మరాఠాలో షిండేను అడ్డం పెట్టుకుని మహా వికాస్ అఘాడీ సర్కార్ ను కూల్చింది. ఇక తదుపరి పశ్చిమ బెంగాల్ పై కన్నేసింది. తెలంగాణపై ఫోకస్ పెట్టింది.
తమిళనాడులో మెల మెల్లగా పావులు కదుపుతోంది. కానీ అక్కడ డీఎంకే పవర్ ఫుల్ గా ఉండడంతో భాష పేరు, మతం పేరుతో ప్లాన్ చేసింది కానీ వర్కవుట్ కావడం లేదు.
మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కారణం ఏమిటంటే జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరేన్(Jharkhand CM) మైనింగ్ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనంటూ బీజేపీ ఫిర్యాదు చేసింది.
దీనిపై గవర్నర్ ఈసీని కోరారు. దీంతో ఈసీ ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించినట్లు సమాచారం.
Also Read : బిల్కిస్ దోషుల విడుదలపై సుప్రీం నోటీస్