Bihar Youtuber Arrested : బీహార్ యూట్యూబర్ అరెస్ట్
వలస కార్మికులపై ఫేక్ వీడియోస్
Bihar Youtuber Arrested : తమిళనాడులో దాడికి గురైన వలస కార్మికులకు సంబంధించి ఫేక్ వీడియోలను అప్ లోడ్ చేసిన బీహార్ కు చెందిన యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. కశ్యప్ , ఇతరులపై తమిళనాడులో వలసదారులను చంపడం, కొట్టడం వంటి నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం అనే ఆరోపణలపై మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 6న ఎఫ్ఐఆర్ నమోదైంది.
వలస కార్మికుల నకిలీ వీడియోలను రూపొందించినందుకు బీహార్ తో పాటు తమిళనాడు పోలీసులు బీహార్ కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ ను శనివారం ఉదయం అరెస్ట్(Bihar Youtuber Arrested) చేశారు. ఈ కేసులో ఇది మూడో అరెస్ట్ కావడం విశేషం.. పశ్చిమ చంపారన్ జిల్లా లోని బెట్టియా లోని జగదీష్ పూర్ పోలీస్ స్టేషన్ లో కశ్యప్ ను అదుపులోకి తీసుకున్నారు. బీహార్ పోలీసుల ముందు లొంగి పోయాడు.
అంతే కాకుండా అతడి ఆస్తులను అటాచ్ చేసేందుకు ఆర్థిక నేరాల విభాగం అతడి ఇంటికి చేరుకుంది. తమిళనాడులో పని చేస్తున్న బీహార్ నివాసితుల గురించి తప్పుడు , తప్పుదారి పట్టించే వీడియోలను ప్రసారం చేసినట్లు కశ్యప్ పై ఆరోపణలు ఉన్నాయి.
తనంతకు తానుగా వచ్చి లొంగి పోయాడని ఆర్థిక నేరాల విభాగం వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. మార్చి 15న మనీష్ కశ్యప్ , యువరాజ్ సింగ్ రాజ్ పుత్ లకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది కోర్టు. ఇందుకు సంబంధించి రాష్ట్ర పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Also Read : యుఎస్ నగరాలతో కైలాస ఒప్పందం