Bilkis Bano : దోషుల విడుదలపై సుప్రీంలో బిల్కిస్ సవాల్
విచారణకు స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం
Bilkis Bano : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో(Bilkis Bano) కేసు మరోసారి చర్చకు దారి తీసింది. ఈ ఏడాది ఆగస్టు 15న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా కుటుంబీకులు, కూతురిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో కోర్టు జీవిత ఖైదు విధించింది.
అయితే కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒత్తిళ్ల మేరకు గుజరాత్ కాషాయ సర్కార్ ఖైదీల ప్రవర్తన బాగుందంటూ కితాబు ఇచ్చింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 15న దేశానికి స్వతంత్రం వచ్చిన రోజున సభ్య సమాజం సిగ్గు పడే రీతిన 11 మంది దోషులను విడుదల చేసింది.
దీనిపై దేశమంతటా ఆందోళన వ్యక్తమైంది. మేధావులు, మహిళా సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై ఎనిమిది వేల మందికి పైగా మహిళలు సంతకాలు చేస్తూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అప్పట్లో సంచలనం రేపింది.
ఇదిలా ఉండగా బిల్కిస్ బానో అత్యాచారానికి గురైన సమయంలో ఆమె వయస్సు 21 ఏళ్లు. తాజాగా బాధితురాలు బిల్కిస్ బానో(Bilkis Bano) 2002 గుజరాత్ అల్లర్లలో తనపై సామూహిక అత్యాచారం చేసి, తన కుటుంబాన్ని హత మార్చిన 11 మంది దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
50 మంది యాత్రికులు మరణించిన గోద్రా రైలు ఘటన తర్వాత బిల్కిస్ బానో మూడేళ్ల కూతురుతో పాటు కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులను చంపారు. ఆ హంతకులను ఉరి తీయకుండా ఎందుకు ఉంచారంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.
Also Read : లక్ష్మణ రేఖ దాటిన కిరెన్ రిజిజు – సాల్వే