Bishan Singh Bedi : క్రికెట్ దిగ్గ‌జం ఇక లేరు

బిష‌న్ సింగ్ బేడీ గ్రేట్ ప్లేయ‌ర్

Bishan Singh Bedi : భార‌తీయ క్రికెట్ రంగంపై త‌న‌దైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకుని, ఎన్నో విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషించిన మాజీ కెప్టెన్ , గ్రేట్ ఆల్ టైమ్ స్పిన్న‌ర్ గా గుర్తింపు పొందిన బేష‌న్ సింగ్ బేడీ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 77 ఏళ్లు. క్రికెట‌ర్ గా, మెంటర్ గా , కామెంటేట‌ర్ గా పేరు పొందారు బేడి. ఆయ‌న మృతితో యావ‌త్ క్రికెట్ లోకం తీవ్ర విషాదానికి లోనైంది. ప్ర‌స్తుతం భార‌త్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ కొన‌సాగుతోంది. భారత క్రికెట‌ర్లు ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మౌనం పాటించారు. కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతిని తెలియ చేశారు.

Bishan Singh Bedi No More

స్పిన్ మాయ‌జాలంతో దేశంలోని క్రికెట్ ప్రియుల మ‌న‌సు దోచుకున్నాడు బిష‌న్ సింగ్ బేడి(Bishan Singh Bedi). క్రికెట్ ప‌రంగా ఎన్నో సూచ‌న‌లు చేశాడు. ఎక్క‌డ త‌ప్పు జ‌రిగినా లేదా పొర‌పాట్లు చేసుకున్నా ఊరుకోలేదు. త‌న అభిప్రాయాల‌ను నిక్క‌చ్చిగా చెప్పారు.

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్, సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ , మ‌హ‌మ్మ‌ద్ అజాహ‌రుద్దీన్, రోజ‌ర్ బిన్నీ, మ‌ద‌న్ లాల్ , అనిల్ కుంబ్లే, హ‌ర్బ‌జ‌న్ సింగ్ , స‌చిన్ టెండూల్క‌ర్ , అజ‌య్ జ‌డేజా, రాహుల్ ద్ర‌విడ్, సౌర‌వ్ గంగూలీ, మ‌ణింద‌ర్ సింగ్ , త‌దిత‌ర ఆట‌గాళ్లు బేష‌న్ సింగ్ బేడీకి నివాళులు అర్పించారు.
సోష‌ల్ మీడియాలో ఆయ‌న ట్రెండింగ్ లో కొన‌సాగారు.

13 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ సాగింది. 28.71 స‌గ‌టుతో 266 టెస్టు వికెట్లు తీసుకున్నాడు. చంద్ర‌శేఖ‌ర్, ప్ర‌స‌న్న‌, వెంక‌ట్ రాఘ‌వ‌న్ , బేష‌న్ సింగ్ బేడీ చ‌తుష్ట‌యం పేరు పొందింది. ఇదిలా ఉండ‌గా దేశం గ‌ర్వించ ద‌గిన ఆట‌గాడిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు ప్ర‌ధాని మోదీ.

Also Read : AFG vs PAK World Cup : చెల‌రేగిన ఆఫ్గాన్ త‌ల‌వంచిన పాకిస్తాన్

Leave A Reply

Your Email Id will not be published!