BJP Alliance Win Elections : బీజేపీ మిత్ర‌ప‌క్షాల‌ క్లీన్ స్వీప్

మూడు రాష్ట్రాల‌లో కాషాయానిదే హ‌వా

BJP Alliance Win Elections : న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఈశాన్యంలో మ‌రోసారి త‌న స‌త్తా చాటింది. మ‌రోసారి క్లీన్ స్వీప్ చేసింది. ప‌క‌డ్బందీ వ్యూహాల‌తో ప్ర‌తిప‌క్షాల‌ను ఉక్కిరి బిక్కిరి చేయ‌డంలో మోదీ, అమిత్ షా త‌ర్వాతే ఎవ‌రైనా.

త్రిపుర‌, నాగాలాండ్ మ‌రోసారి అధికారంలోకి రానుంది బీజేపీ. ఇక మేఘాల‌య‌లో నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతోంది. 

బీజేపీ దాని మిత్ర‌ప‌క్షం ఇండిజ‌న‌స్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర తో క‌లిసి 60 సీట్ల‌కు గాను 37 సీట్లు కైవ‌సం చేసుకుంది. త్రిపురలో బీజేపీ 28 సీట్లలో(BJP Alliance Win) జెండా ఎగుర వేసింది.

మిత్ర‌ప‌క్షాల స‌హ‌కారంతో త్రిపుర‌, నాగాలాండ్ ల‌లో కాన్రాడ్ సంగ్మాతో క‌లిసి మేఘాల‌యలో ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఎన్నిక‌లకు ముందు ఎన్పీపీ, బీజేపీ మ‌ధ్య విభేదాలు పొడ‌సూపాయి. దీంతో వేర్వేరుగానే మేఘాల‌యలో పోటీ చేశాయి.

ఇక్క‌డ టీఎంసీ తొలిసారిగా భారీ సంఖ్య‌లో సీట్లు కొల్ల‌గొట్టింది. సంగ్మా నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ 26 సీట్ల‌తో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది.

ఇక్క‌డ బీజేపీ 2 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఎన్పీపీ మిత్రంగా ఉన్న యునైటెడ్ డెమోక్ర‌టిక్ పార్టీ 11 స్థానాల‌ను గెలుచుకుంది. రెండో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. టీఎంసీ 5, కాంగ్రెస్ 5 సీట్లతో స‌రి స‌మానంగా గెలుచుకున్నాయి.

త్రిపుర‌లో బీజేపీ 32 సీట్లు గెలుచుకుంది. మాణిక్ సాహా అంచ‌నాలు ఇక్క‌డ త‌ప్పాయి. 2018లో 36 సీట్లు ఉండ‌గా ఆ సంఖ్య 4కు త‌గ్గింది. టిప్రా మోతా పార్టీ ఏకంగా 13 సీట్లు గెలుచుకుని రెండో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది.

ఇక నాగాలాండ్ లో బీజేపీ(BJP Alliance Win Elections) 12 స్థానాల‌ను నిలుపుకుంది. దాని మిత్ర ప‌క్షం నేష‌న‌లిస్ట్ డెమోక్ర‌టిక్ ప్రోగ్రెసివ్ 25 స్థానాల‌ను గెలుచుకుని విస్తు పోయేలా చేసింది. ఇక్క‌డ రెండో సారి బీజేపీ త‌న మిత్ర‌ప‌క్షంతో క‌లిసి ప‌వ‌ర్ లోకి రానుంది. మొత్తంగా బీజేపీ మూడు రాష్ట్రాల‌లోనూ పాగా వేయ‌నుంది. 

రాష్ట్రానికి స్వాతంత్రం వ‌చ్చాక మొద‌టి సారిగా ఎమ్మెల్యేలు గెలుపొంద‌డం విశేషం. ఎన్డీపీపీకి చెందిన వారే ఆ ఇద్ద‌రు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఉంద‌ని మ‌రోసారి ఈ ఫ‌లితాలు వెల్ల‌డించాయ‌ని పేర్కొన్నారు. 35 ఏళ్ల పాటు పాలించిన సీపీఎంకు ఘోర‌మైన అవ‌మానం. ఆ పార్టీ కాంగ్రెస్ తో జ‌త క‌ట్టినా ప్ర‌భావం చూప‌లేక పోయింది.

Also Read : ప్ర‌మాదంలో భార‌త ప్ర‌జాస్వామ్యం

Leave A Reply

Your Email Id will not be published!