BJP Telangana : భారతీయ జనతా పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ తప్ప ఇతర నాలుగు రాష్ట్రాలలో తన జెండా ఎగుర వేసింది. దీంతో పార్టీకి చెందిన సంస్థలు, శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ప్రతినిధులు సంతోషంలో మునిగి పోయారు.
తనకు ప్రత్యామ్నాయంగా భావిస్తూ వచ్చిన కాంగ్రెస్ రోజు రోజుకు బలహీన పడుతుండడంతో
కాషాయం ఆక్టోపస్ లో అల్లుకు పోయే పనిలో పడింది. ఓ వైపు ఆయా రాష్ట్రాలలో రెండోసారి అధికారం చేపట్టనుంది బీజేపీ.
ఓ వైపు ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మేసుకుంటూ వెళుతున్నా ఓటర్లు తమకు పట్టం కట్టడంపై ఆ పార్టీ శ్రేణులే ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నాయి.
ఇంకో వైపు బీజేపీయేతర ప్రభుత్వాలపై, సంస్థలపై కేంద్రం టార్గెట్ చేస్తోంది.
కేంద్ర సంస్థలను ప్రయోగిస్తూ తనకు ఎదురే లేకుండా చేస్తోంది.
ఇప్పటికే సాధించిన విజయాలతో జోష్ లో ఉన్న బీజేపీ హైకమాండ్ తదుపరి టార్గెట్ దక్షిణాదిలోని తెలంగాణపై (BJP Telangana)పెట్టినట్లు టాక్.
ఇప్పటికే ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో బీజేపీ ముందంజలో ఉంది.
రోజు రోజుకు కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, దానిని క్యాష్ చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
ఇప్పటికే వాట్సాప్ యూనివర్శిటీగా మారి పోయిందన్న ఆరోపణలను కొట్టి పారేస్తూ దేశంలో ఏ పార్టీకి లేని స్ట్రాటజీని బీజేపీ అమలు చేస్తోంది.
అన్ని పార్టీల కంటే సామాజిక మాధ్యమాలలో ఆ పార్టీ ముందంజలో ఉంది.
ఇప్పటి నుంచే గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో పడింది బీజేపీ.
ఇందులో భాగంగా అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులతో పాటు కాంగ్రెస్ కు చెందిన లీడర్లపై ఓ కన్నేసి ఉంచుతోంది.
హుజూరాబాద్ బై పోల్ లో సాధించిన విజయం ఆ పార్టీకి మరో బూస్ట్ అప్ గా మారిందని చెప్పక తప్పదు.
అయితే కేసీఆర్ ను అరెస్ట్ చేస్తామని పదే పదే చెబుతున్న బీజేపీ(BJP Telangana) ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించే చాన్స్ లేక పోలేదు. గెలిపించే రథ సారథులు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అది ట్రబుల్ షూటర్ చేతిలో ఉందనేది వాస్తవం.
Also Read : భగవంత్ మాన్ జీ ‘జీతే రహో’