BJP Manifesto : నిరాశ పర్చిన బీజేపీ మేనిఫెస్టో
నిరుద్యోగులు..జాబ్స్ ఊసెత్తని వైనం
BJP Manifesto : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ బీజేపీ(BJP) ఎన్నికల మేనిఫెస్టోను ఎట్టకేలకు విడుదల చేసింది. ఆ పార్టీకి చెందిన ట్రబుల్ షూటర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా దీనిని రిలీజ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయానికి సంబంధించి ఫోకస్ పెట్టలేదు. ప్రధానంగా రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. కానీ ఒక్క పోస్ట్ కూడా భర్తీచేయక పోవడం శోచనీయం.
BJP Manifesto Issues
జాబ్స్ విషయంలో ఊసెత్తక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తాము ప్రజా సమస్యలను పట్టించు కోవడం లేదని చెప్పకనే చెప్పారు. ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే ..ధరణి స్థానంలో మీ భూమి యాప్ తీసుకు వస్తామని ప్రకటించింది. పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీతో పాటు రాష్ట్ర సర్కార్ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది.
4 శాతం ఉన్న ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ ఎత్తి వేస్తామని ప్రకటించింది. సబ్సిడీ పై విత్తనాలు… వరిపై బోనస్, ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 యేళ్లు వచ్చే సరికి 2 లక్షల రూపాయలు. ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు, మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు, ఫీజుల నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొంది.
బడ్జెట్ స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు. ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ , నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, ఇండస్ట్రియల్ కారిడార్ ల ఏర్పాటు, ప్రతి 5 సంవత్సరాలకు ఓ సారి పీఆర్సీ, జీఓ 317 పై పునః సమీక్ష, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ లు ఏర్పాటు చేస్తామని తెలిపింది బీజేపీ.
5 ఏళ్ల కు లక్ష కోట్ల తో బీసీ అభివృద్ది నిధి ఏర్పాటు, రోహింగ్యాలు, అక్రమ వలస దారులనీ పంపించి వేస్తాం, తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు, అన్ని పంటలకు పంట భీమా, 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన, వృదులకు కాశీ, అయోధ్య లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేసింది బీజేపీ.
Also Read : Jagannath Reddy : అల్లుడికి షాక్ మామ జంప్