Jagannath Reddy : అల్లుడికి షాక్ మామ జంప్

కోడంగ‌ల్ లో న‌రేంద‌ర్ రెడ్డికి షాక్

Jagannath Reddy: హైద‌రాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది. ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు క్యూ క‌డుతున్నారు హ‌స్తం గూటిలో చేరేందుకు. విచిత్రం ఏమిటంటే కోడంగ‌ల్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి(Patnam Narender Reddy) కి చెందిన స్వంత మామ జ‌గ‌న్నాథ రెడ్డి జంప్ అయ్యారు. ఆయ‌న‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాను గులాబీ ముళ్ల‌ను త‌ట్టుకోలేనంటూ పేర్కొన్నారు. ఆ వెంటనే హైద‌రాబాద్ లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.

Jagannath Reddy Joining Viral

కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. దీంతో కోడంగ‌ల్ లో బిగ్ షాక్ త‌గిలిన‌ట్ల‌యింది అధికార బీఆర్ఎస్ పార్టీకి. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది శాంపుల్ మాత్ర‌మేన‌ని ఇక కోడంగ‌ల్ లో ఎగ‌ర బోయేది త‌మ జెండానేన‌ని స్ప‌ష్టం చేశారు.

ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివ‌ర‌కు ప్ర‌లోభాల‌కు గురి చేసినా వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని జోష్యం చెప్పారు. రోజు రోజుకు త‌మ పార్టీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంద‌న్నారు. వీరిని అడ్డు కోవ‌డం కేసీఆర్ త‌రం కాద‌న్నారు రేవంత్ రెడ్డి.

కాబోయే సీఎం తానేన‌ని ఇక తొలి సంత‌కం కూడా చేసేది కూడా నేన‌ని పేర్కొన్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే త‌న మామ జంప్ కావ‌డంతో మిన్న‌కుండి పోయారు. ఇంకా దీనిపై స్పందించేందుకు బ‌య‌ట‌కు రాలేదు.

Also Read : Minister KTR : తెలంగాణ న‌జ‌రానా అభివృద్దికి న‌మూనా

Leave A Reply

Your Email Id will not be published!