MLC Puttanna Joins : బీజేపీకి ఎమ్మెల్సీ షాక్ కాంగ్రెస్ కు జంప్

శాస‌న మండ‌లి ప‌ద‌వికి రాజీనామా

MLC Puttanna Joins : ఈ ఏడాది ఏప్రిల్ – మే నెల‌లో క‌ర్ణాట‌క‌లో శాస‌స స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న బీజేపీ మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని చూస్తోంది. ఉన్న‌ట్టుండి బీజేపీకి బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పుట్ట‌న్న(MLC Puttanna) పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆ వెంట‌నే కాషాయానికి క‌టీఫ్ చెప్పిన పుట్టన్న క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ చీప్ డీకే శివ‌కుమార్ , మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌ల స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా బీజేపీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కూడా చేశారు. ఆయ‌న ఇప్ప‌టి దాకా బీజేపీ త‌ర‌పున ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వ‌హించారు.

పుట్ట‌న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అనంత‌రం అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అవీనితి, అక్ర‌మాల‌కు పార్టీ కేరాఫ్ గా మారింద‌ని మండిప‌డ్డారు. అందుకే తాను అక్క‌డ ఉండ‌లేక పోయాన‌ని వాపోయారు. ప్ర‌జాస్వామ్యం అన్న‌ది పార్టీలో లేద‌ని , కేవ‌లం హైక‌మాండ్ చేతిలో కీలు బొమ్మ‌లుగా ఉండ‌ద‌ల్చు కోలేద‌ని స్ప‌ష్టం చేశారు పుట్ట‌న్న‌(MLC Puttanna Joins).

ప్ర‌స్తుత స‌ర్కార్ ఏ ఒక్క స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రించ లేక పోయింద‌ని మండిప‌డ్డారు. బెంగ‌ళూరు అర్బ‌న్ , రూర‌ల్ , రామ‌నగ‌ర జిల్లాల ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు పుట్ట‌న్న‌. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న ప‌ద‌వీ కాలం 2026 దాకా ఉంది.

Also Read : ఢిల్లీలో క‌ల్వ‌కుంట్ల క‌విత దీక్ష

Leave A Reply

Your Email Id will not be published!