BJP President JP Nadda: వైసీపీ అవినీతి పాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారు – జేపీ నడ్డా

వైసీపీ అవినీతి పాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారు - జేపీ నడ్డా

JP Nadda : ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి పథంలో నడుస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) అన్నారు. బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ చేపట్టిన ‘సారథ్యం’ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం… అవినీతి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబించిందని విమర్శించారు.

JP Nadda Slams YS Jagan

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘కనకమహాలక్ష్మి అమ్మవారికి, వరాహ నరసింహ స్వామి వారికి నమస్కరించి నా ఉపన్యాసం మొదలు పెడతాను. విశాఖపట్నం తూర్పు తీరానికి తలమానికం వంటి ఆభరణం.‌ ఎన్నికలకు ముందు తిరుపతి పర్యటనకు వచ్చినపుడు చెప్పాను. వైసీపీ సర్కారు నిష్క్రియా పరత్వానికి పేరుపొందింది. దాన్ని ఓడించి మా కూటమిని అధికారానికి తెచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. ఏపీని మళ్లీ అభివృద్ధి పట్టాలు ఎక్కించాం. 2014లో మోదీ ప్రధాని అయినపుడు దేశ ఆర్ధిక వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉంది. మనదేశ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలొ పదకొండో స్థానంలో ఉండేది. ఇపుడు మూడో స్థానానికి చేరుతున్నాము. ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాము. రక్షణ రంగ ఎగుమతుల్లో సైతం ఏడు రెట్ల ప్రగతికి చేరాం. సెల్ ఫోన్ల తయారీలో 92 లక్షలు సంఖ్య దాటాం.

ప్రస్తుతం ‘సబ్ కా సాథ్‌, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. అయోధ్యలో రామ మందిరం నిర్మించాం. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ముందుగానే దసరా, దీపావళి తీసుకొచ్చాం. రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం. విశాఖ, కాకినాడ, తిరుపతి స్మార్ట్‌ సిటీలుగా నిలుస్తున్నాయి. సాగరమాల పేరుతో 14 పోర్టులు నిర్మిస్తున్నాం. పది కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేశాం. కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇచ్చాం. రైల్వేలో అమృత్ భారత్, వందే భారత్ తెచ్చాం. విశాఖ, విజయవాడ, ఓర్వకల్లును అభివృద్ధి చేశాం. భోగాపురానికి రూ.625 కోట్ల నిధులు ఇస్తున్నాం. ఆరు కొత్త వైద్య సంస్థలు ప్రారంభించాం. ప్రపంచంలో అతి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్న పార్టీ బీజేపీ. మోదీ నాయకత్వంలో 12 ఏళ్లుగా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోతుందన్నారు.

కార్యకర్తలు గ్రామగ్రామానికీ వెళ్లి వైసీపీ చీకటి రాజ్యాన్ని, ప్రస్తుత ఎన్డీయే అభివృద్ధి వెలుగులనూ వివరించాలి. మనం దేశ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఆంధ్రప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాలి. ఆంధ్రప్రజల మనసులొ మోదీ ఉన్నారు, మోదీ మదిలో ఆంధ్రప్రజలున్నారు. మన రాజకీయం అభ్యుదయం కోసమే. కోట్లాది కార్యకర్తల కృషి వల్లనే దేశాన్ని బిజెపి అభివృద్ధి చేయగలుగుతోంది

2014కు ముందు దేశంలో అసమర్థ, వారసత్వ రాజకీయాలు

2014కు ముందు దేశంలో అసమర్థ, వారసత్వ రాజకీయాలు నడిచేవి. అప్పట్లో దేశంలో అవినీతి రాజ్యమేలింది. 2014కు ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు మేనిఫెస్టో తీసుకొచ్చి ఎన్నికలయ్యాక మరిచిపోయేవారు. వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఆ పార్టీ అవినీతి పాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారు. ఇప్పుడు మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ఆంధ్ర ప్రజల గుండెల్లో మోదీ ఉన్నారు. ఆయన గుండెల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సైద్ధాంతిక పునాదులపై నిర్మాణమైన పార్టీ బీజేపీ’’ అని జేపీ నడ్డా (JP Nadda) అన్నారు.

Also Read : Speaker Ayyannapatrudu: జగన్‌ పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశక్తికర వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!