BJP Focus : బీజేపీ ఫోకస్ కమలనాథులకు టార్గెట్
వచ్చే 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు
BJP Focus : భారతీయ జనతా పార్టీ 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తం అవుతోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీకి చెందిన వ్యూహకర్త, ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా 350 సీట్లు
గెలుపొందాలని టార్గెట్ గా నిర్ణయించారు.
ఏ మాత్రం తగ్గినా ఊరుకోబోమంటూ ఇప్పటికే హెచ్చరించారు. ఇందులో భాగంగా పార్టీ చీఫ్ జేపీ నడ్డా కీలక నిర్ణయం తీసుకున్నారు షాతో భేటీ అయ్యాక.
గుజరాత్, త్రిపుర మాజీ సీఎంలు విజయ్ రూపానీ, బిప్లబ్ దేబ్ , ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు ఎన్నికలకు ముందు కీలక రాష్ట్రాలలో పని చేయనున్నారు.
ఇప్పటికే పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు అమిత్ షా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాతే ఈ కీలక నిర్ణయం వెలువడింది.
ఉద్వాసన గురైన వారికి పార్టీ పరంగా పదవులు కట్టబెట్టంది బీజేపీ(BJP Focus). బీజేపీయేతర రాష్ట్రాలలో కాషాయా జెండా ఎగుర వేయాలన్న లక్ష్యంలో భాగంగా వ్యూహాత్మాకంగా అడుగులు వేస్తోంది పార్టీ.
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాలకు బాధ్యతలు అప్పగించారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఆప్ పవర్ లో ఉంది పంజాబ్ లో . ఇక్కడ పాగా వేయాలన్నది పార్టీ పరంగా ప్లాన్. హర్యానాలో త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక్కడ పార్టీ పవర్ లోకి వచ్చింది. కానీ ఆశించినంత మేర పట్టు సాధించ లేక పోయింది. ప్రకాశ్ జవదేకర్ కు కేరళను కేటాయించారు. మహేశ్ శర్మ త్రిపురకు ఇచ్చారు.
ఇక పశ్చిమ బెంగాల్ లో బీహార్ మాజీ మంత్రి మంగళ్ పాండేను బీజేపీ ఇన్ చార్జ్ గా చేసింది. ఇక్కడ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ కో ఇన్ చార్జిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు జేపీ నడ్డా.
పాండే ఒడిశా, తెలంగాణతో పాటు బెంగాల్ ను పర్యవేక్షిస్తున్న సునీల్ బన్సాల్ తో కలిసి పని చేస్తారు. వినోద్ తావ్డేకి బీహార్ అప్పగించారు. జార్ఖండ్ లో
లక్ష్మీకాంత్ వాజ్ పేయి కి కీలక పదవి కట్టబెట్టారు.
పీఎంకు సన్నిహితుడిగా భావించే ఓం మాథుర్ కు ఛత్తీస్ గడ్ అప్పగించారు. ప్రముఖ టీవీ పేస్ సంబిత్ పాత్రను ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్తగా నియమించారు.
జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా సంయుక్త సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. రాజస్తాన్ లో అరుణ్ సింగ్ , మధ్య ప్రదేశ్ లో మురళీధర్ రావు కొనసాగించారు.
Also Read : రాజస్థాన్ లో 100 రోజుల ఉపాధి పథకం