BL Santosh TS High Court : ‘బీఎల్ సంతోష్’ కు సంతోషం
స్టే ఇచ్చిన రాష్ట్ర హైకోర్టు
BL Santosh TS High Court : భారతీయ జనతా పార్టీలో ఆయన అగ్రనేతగా ఉన్నారు. అంతే కాదు ట్రబుల్ షూటర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు దగ్గరి స్నేహితుడు. ఆయనకు చెబితే అమిత్ షాకు చెప్పినట్టేనని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటాయి. ఈ తరుణంలో ఊహించని రీతిలో తెలంగాణ పోలీసులు కోలుకోలేని షాక్ ఇచ్చారు.
ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులలో ఒకరు బీఎల్ సంతోష్(BL Santosh) పేరును ప్రస్తావించారు. దీంతో ఈ ఎమ్మెల్యే కుట్ర కోణంలో సంతోష్ కు పాత్ర ఉందంటూ నోటీసులు పంపించారు.
ఈ మేరకు సిట్ ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఓ వైపు తెలంగాణ పోలీసులు ఎమ్మెల్యేల కేసు విషయంలో బీజేపీ నేతలకు చుక్కలు చూపిస్తుంటే ఆదాయ పన్ను శాఖ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు నిద్ర లేకుండా చేస్తోంది.
ఇప్పటికే మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇళ్లు, ఆఫీసులు, ఇతర కుటుంబీకుల్లో జల్లెడ పట్టింది. ఏకంగా రూ. 18.5 కోట్లు , 15 కేజీల బంగారం స్వాధీనం చేసుకుంది.
ఈ తరుణంలో బీఎల్ సంతోష్ కు సంబంధించిన వ్యవహారం మళ్లీ కోర్టుకు ఎక్కింది. శుక్రవారం ఈ కేసుకు సంబంధించి కోర్టు కీలక వ్యాఖ్యలుచేసింది. సిట్ బీఎల్ సంతోష్ కు ఇచ్చిన నోటీసులపై హైకోర్టు(TS High Court) స్టే ఇచ్చింది. దీంతో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీఎల్ సంతోష్ విషయం తెలిసి సంతోషానికి లోనైనట్లు టాక్.
Also Read : భాగ్యనగరానికి మరో మణిహారం