Blast in Bakery: హైదరాబాద్ లో భారీ పేలుడు ! ఐదుగురికి తీవ్ర గాయాలు !
హైదరాబాద్ లో భారీ పేలుడు ! ఐదుగురికి తీవ్ర గాయాలు !
Blast in Bakery : హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సత్యం థియేటర్ దగ్గర క్రిసెంట్ కేఫ్ అండ్ బేకర్స్‌లో భారీ పేలుడు సంభవించింది. బేకరీలో గ్యాస్ సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. ఈ పేలుడు ధాటికి షాప్ లోని సామాగ్రి ఎగిరి బయటపడ్డాయి. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలవగా… వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రమాద సమయంలో కేఫ్ లో కస్టమర్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. మెయిన్ రోడ్డుపైనే ఈ ఘటన జరగడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు రంగంలోనికి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
Blast in Bakery Hyderabad
కేఫ్ అండ్ బేకర్స్ లో జరిగిన పేలుడుతో హైదరాబాద్(Hyderabad) నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్ధం రావడంతో ఆ బేకరీకు పరిసర ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే గ్యాస్ సిలిండర్ పేలడం వలన ఈ పేలుడు సంభవించింది అని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడూ కష్టమర్లతో… అటుగా వెళ్లే వాహనదారులతో బిజీబిజీగా ఉండే ఈ బేకరీలో… ఎవ్వరూ లేనప్పుడు పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం తప్పింది.
Also Read : Jagadish Reddy: జగదీశ్ రెడ్డిని అసెంబ్లీలోనికి వెళ్ళనీయకుండా అడ్డుకున్న మార్షల్స్