Bose Raju : రేవంత్ కు బోస్ రాజు కంగ్రాట్స్

సీఎంగా స‌క్సెస్ కావాల‌ని పిలుపు

Bose Raju : తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు బోసు రాజు ప్ర‌త్యేకంగా కంగ్రాట్స్ తెలిపారు. రాజ‌కీయంగా ఉన్న‌త‌మైన స్థానంలో కొలువు తీరినందుకు ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నారు. నీకు రాబోయే కాలంలో మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని ఆకాంక్షించారు.

Bose Raju Congratulates to Revanth Reddy

మీ నాయ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల‌లో అభివృద్ది చెందుతుంద‌ని తాను న‌మ్ముతున్న‌ట్లు తెలిపారు బోసు రాజు(Bose Raju). శాంతియుత‌, స‌మ్మిళిత‌, ప్ర‌గ‌తిశీల పాల‌న‌ను సాధిస్తుంద‌ని తాను విశ్వ‌సిస్తున్న‌ట్లు పేర్కొన్నారు .

ఇదిలా ఉండ‌గా రేవంత్ రెడ్డి సామాన్య కుటుంబం నుంచి సీఎం స్థాయికి ఎదిగాడు. త‌ను జ‌ర్న‌లిస్ట్ గా జాగృతి ప‌త్రిక ద్వారా త‌న కెరీర్ స్టార్ట్ చేశాడు. ఏబీవీపీ లో ప‌ని చేశాడు. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. త‌ను జెడ్పీటీసీగా మిడ్జిల్ నుంచి ఎన్నిక‌య్యాడు. ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలుపొందాడు.

మొద‌ట టీఆర్ఎస్ లో ఉన్నాడు. ఆ త‌ర్వాత టీడీపీలో చేరాడు. కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మూడోసారి ఓడి పోయాడు. మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీ గా విజ‌యం సాధించాడు. ప్ర‌స్తుతం సీఎంగా కొలువు తీరబోతుండ‌డం విశేషం.

Also Read : Congress MLAs List : గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శికి ఎమ్మెల్యేల లేఖ

Leave A Reply

Your Email Id will not be published!