Congress MLAs List : గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శికి ఎమ్మెల్యేల లేఖ

అంద‌జేసిన కాంగ్రెస్ పార్టీ నేత‌లు

Congress MLAs List : హైద‌రాబాద్ – తెలంగాణ ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యాన్ని సాధించింది కాంగ్రెస్(Congress) పార్టీ. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 64 మంది అభ్య‌ర్థులుగా గెలుపొందారు. వీరంతా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి ఎల్లా హోట‌ల్ లో విడిది చేశారు. ఇప్ప‌టికే సీఎల్పీ స‌మావేశం జ‌రిగింది. దీనికి ప‌రిశీల‌కులు విచ్చేశారు. మొత్తం ప‌ర్య‌వేక్షించారు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే. ఈ మేర‌కు ఏక వాక్య తీర్మానం చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల‌ను తీసుకున్నారు డీకే. ఈ పూర్తి నివేదిక‌ను ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గేకు అంద‌జేశారు.

Congress MLAs List Submitted to Governer

అనంత‌రం సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణు గోపాల్ సీఎల్పీ నేత‌తో పాటు సీఎంగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌న్నారు. రేవంత్ రెడ్డి త‌ప్ప ఇంకేమీ మాట్లాడాల్సింది ఏమీ లేద‌ని రాహుల్ గాంధీ చెప్ప‌డంతో మిగ‌తా సీఎం రేసులో ఉన్న ఉత్త‌మ్ కుమార్ , భ‌ట్టి విక్ర‌మార్క మిన్న కుండి పోయారు.

దీంతో డిసెంబ‌ర్ 7న గురువారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఇదిలా ఉండ‌గా 64 మంది స‌భ్యుల సంత‌కాల‌తో కూడిన జాబితా లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శి సురేంద్ర మోహ‌న్ కు అంద‌జేశారు.

Also Read : KCR Emotional : కేసీఆర్ కోసం క‌దిలిన జ‌నం

Leave A Reply

Your Email Id will not be published!