KCR Emotional : కేసీఆర్ కోసం క‌దిలిన జ‌నం

ఫామ్ హౌస్ లోకి దూసుకొచ్చారు

KCR : ఎర్ర‌వ‌ల్లి – తెలంగాణ సాధించిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు కేసీఆర్. ల‌క్ష‌లాది మందిని ప్ర‌భావితం చేస్తూ వ‌చ్చారు. 10 ఏళ్ల పాటు సీఎంగా ప‌ని చేశారు. తాజాగా రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌రిగాయి. ముచ్చ‌ట‌గా మూడోసారి ముఖ్య‌మంత్రిగా కావాల‌ని అనుకున్నారు. కానీ సీన్ రివ‌ర్స్ అయ్యింది. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను భారత రాష్ట్ర స‌మితి పార్టీ కేవ‌లం 39 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది.

KCR Emotional Words

దీంతో అధికారాన్ని కోల్పోయింది. కేసీఆర్(KCR) త‌నంత‌కు తానుగా రాజీనామా చేసి ఎలాంటి కాన్వాయ్ లేకుండానే ఎర్ర వెల్లి లోని ఫామ్ హౌస్ కు వెళ్లి పోయారు. అక్క‌డి నుంచే ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌ల‌ను క‌లుసుకుంటున్నారు.

తాజాగా ఊహించ‌ని స‌న్నివేశం చోటు చేసుకుంది. గ‌తంలో ఫామ్ హౌస్ లోకి ఎవ‌రినీ లోప‌లికి రానిచ్చే వారు కాదు. కానీ అనుకోకుండా చింత‌మ‌డ‌క గ్రామానికి చెందిన ప్ర‌జ‌లు మూకుమ్మ‌డిగా కేసీఆర్ ను చూసేందుకు త‌ర‌లి వ‌చ్చారు.

పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చిన జ‌నాన్ని చూసిన కేసీఆర్ ఉద్వేగానికి లోన‌య్యారు. మీరు మ‌రోసారి సీఎం కావాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ప్రాంగ‌ణ‌మంతా హోరెత్తి పోయింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Also Read : Revanth Reddy : ప్ర‌జాలారా రండి ఆశీర్వ‌దించండి

Leave A Reply

Your Email Id will not be published!