Brendon McCullum : ఈసారి కేకేఆర్ ను త‌ట్టుకోవ‌డం క‌ష్టం

కేకేఆర్ కోచ్ బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్ కామెంట్

Brendon McCullum : ఐపీఎల్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ స‌త్తా చాట‌డం ఖాయ‌మ‌ని, త‌మ‌ను త‌ట్టు కోవ‌డం క‌ష్ట‌మ‌ని అన్నారు ఆ జ‌ట్టు కోచ్ బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్(Brendon McCullum). ప్ర‌ధానంగా జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ను ఆకాశానికి ఎత్తేశాడు.

సూప‌ర్ స్టార్ ఆఫ్ ది గేమ్ గా మార‌గ‌ల‌డ‌ని ఇందులో ఎలాంటి సందేహం అక్క‌ర్లేద‌న్నాడు. ఇవాళ సీఎస్కేతో మ్యాచ్ సంద‌ర్భంగా మాట్లాడాడు మెకల్ల‌మ్. ఇవాళ స‌మ ఉజ్జీలుగా భావించే రెండు జ‌ట్లు మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్నాయి.

నువ్వా నేనా అన్న రీతిలో సాగే ఈ మ్యాచ్ పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇరు జ‌ట్లు హోరా హోరీగా పోరాడ‌డం ఖాయ‌మ‌ని, అస‌లైన క్రికెట్ లో ఉన్న మ‌జా ఏమిటో అర్థ‌మ‌వుతుంద‌న్నాడు బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్(Brendon McCullum).

ఐపీఎల్ కు ముందు ఉన్న‌ట్టుండి ఆ జ‌ట్టు కెప్టెన్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం సీఎస్కేపై ఎక్కువ ప్ర‌భావం చూపుతుంద‌న్నాడు. కానీ త‌మ వైపు ఎలాంటి వ‌త్తిడి లేద‌ని పేర్కొన్నాడు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ తో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంద‌న్నాడు. అత‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ఆడుతున్న‌ప్ప‌టి నుంచి గ‌మ‌నిస్తూ వ‌స్తున్నాన‌ని తెలిపాడు. గుజ‌రాత్ ల‌య‌న్స్ కు ఆడుతున్న స‌మ‌యంలో క‌లిశాన‌ని పేర్కొన్నాడు.

నా నంబ‌ర్ త‌న‌కు ఇచ్చా. అత‌డి నంబ‌ర్ తీసుకున్నా. ఎందుకు కాల్ చేయ‌లేద‌ని అడిగా. భ‌య‌ప‌డ్డానని చెప్పాడ‌న్నాడు. కానీ సీన్ మారింది.

ఇప్పుడు ఆ జ‌ట్టుకు కోచ్ గా ఉన్నా. ఈసారి స‌త్తా చాటేందుకు శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎంతో ఉత్సుక‌త‌తో, దూకుడుతో ఉన్నాడ‌ని తెలిపాడు బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్.

Also Read : పాకిస్తాన్ ప‌రాజ‌యం ప‌రిస‌మాప్తం

Leave A Reply

Your Email Id will not be published!