Brendon Meccullum : ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది కోల్ కతా నైట్ రైడర్స్ . ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తాడు ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendon Meccullum ).
ప్రధానంగా అజింక్యా రహానే తన అనుభవాన్ని రంగరించి వికెట్లు పోకుండా జాగ్రత్తగా ఆడాడని కితాబు ఇచ్చాడు. ఇదే సమయంలో ప్రస్తుతం కేకేఆర్ కు స్కిప్పర్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ను ఆశాకానికి ఎత్తేశాడు.
రాబోయే కాలంలో ప్రపంచ క్రికెట్ లో అద్బుతమైన ప్లేయర్ గా రాణించే అవకాశం అయ్యర్ కు ఎక్కువగా ఉందన్నాడు మెకల్లమ్. భారత జట్టుతో పాటు వరల్డ్ క్రికెట్ లో అతడు మరింత గొప్పగా ఆడగలడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
క్రికెట్ కు సంబంధించి ఏ ఫార్మాట్ లోనైనా ఆడగలిగే సత్తా ఉన్నోడు అయ్యర్ అని పేర్కొన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ను ఓడించిన అనంతరం మీడియాతో మాట్లడాడాడు హెడ్ కోచ్ . ఇది పూర్తిగా తమ జట్టుకు ఉన్న అదనపు బలాన్ని సూచిస్తుందని తెలిపాడు.
నాయకుడిగా కూడా పరిణతి చెందాడని, జట్టులోని అందరి ఆటగాళ్లతో సమన్వయం చేసుకోవడంలో ఎక్కువగా ఫోకస్ పెట్టాడని తెలిపాడు మెకల్లమ్.
ప్రధానంగా తమ జట్టులో బౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా రాణించడం సంతోషం కలిగించిందని చెప్పాడు. ఇదే రకంగా శ్రేయస్ అయ్యర్ ఆడుతూ వెళితే సుదీర్ఘ కాలం పాటు ఆడేందుకు మార్గం ఉంటుందన్నాడు.
Also Read : భారత్ ను ముంచిన నో బాల్