ఐపీఎల్ 16వ సీజన్ లో సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పై విమర్శలు ఆగడం లేదు. ట్విట్టర్ వేదికగా ట్రోల్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బౌలర్ గా ప్రయత్నం చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో జరిగిన మ్యాచ్ లో ఒక ఓవర్ లోనే 31 రన్స్ సమర్పించుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో 9 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఆపై భారీ సిక్స్ కూడా కొట్టాడు. మొత్తంగా ఇప్పటి వరకు 3 వికెట్లు తీశాడు. అయినా అర్జున్ టెండూల్కర్ పై విమర్శలు ఆగడం లేదు. సచిన్ ప్రాపకం వల్లనే అర్జున్ టెండూల్కర్ కొనసాగుతున్నాడంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. దీంతో ప్రముఖ ఆసిస్ లెజండరీ బౌలర్ బ్రెట్ లీ సీరియస్ గా స్పందించాడు.
అర్జున్ టెండూల్కర్ కు సపోర్ట్ గా నిలిచాడు. గ్రౌండ్ లో ఆడే వాళ్లు మైదానం బయట ఉండే వాళ్ల విమర్శలను పట్టించు కోకూడదని సలహా ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ల గురించి ఆలోచించడం మొదలు పెడితే ఆటపై ఫోకస్ పెట్టడం మరిచి పోతామని పేర్కొన్నాడు. సీనియర్ బౌలర్ సందీప్ శర్మ 120 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తుంటే అర్జున్ టెండూల్కర్ ఏకంగా 140 కి.మీ. వేగంతో బంతులు విసురుతున్నాడని భవిష్యత్తులో మంచి బౌలర్ గా ఎదగడం ఖాయమని జోష్యం చెప్పాడు.