Brij Bhushan Delhi HC : రెజ్ల‌ర్ల‌పై కోర్టుకు ఎక్కిన బ్రిజ్ భూష‌ణ్

కొత్త మ‌లుపు తిరిగిన రెజ‌ర్ల కేసు

Brij Bhushan Delhi HC : భార‌త రెజ‌ర్ల స‌మాఖ్య చీఫ్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ వివాదం ఇంకా కొన‌సాగుతోంది. తాజాగా డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ ఢిల్లీ హైకోర్టును(Brij Bhushan Delhi HC) ఆశ్ర‌యించారు. నిర‌స‌న నేప‌థ్యంలో అగ్ర‌శ్రేణి రెజ్ల‌ర్ల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కోరారు. త‌న‌పై విచార‌ణ ముగియ‌గానే బ్రిజ్ భూష‌ణ్ వినేష్ ఫోగ‌ట్ తో స‌హా అగ్ర‌శ్రేణి రెజ్ల‌ర్ల‌పై ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల‌ని కోరుతూ కోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

లైంగిక ఆరోప‌ణ‌ల పేరుతో త‌న‌ను బ్లాక్ మెయిలింగ్ కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించారు. ఈ మేర‌కు దావాలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్. ఇదిలా ఉండ‌గా గ‌త ఐదు రోజుల కింద‌ట పెద్ద ఎత్తున డ‌బ్ల్యుఎఫ్ఐ చీఫ్ తో పాటు కోచ్ లు త‌మ‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారంటూ వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ రెజ్ల‌ర్లు ఆందోళ‌న చేప‌ట్టారు .

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు. ఆపై చెప్పుకోలేని రీతిలో మాన‌సికంగా, శారీర‌కంగా హిసించాడంటూ ఆరోపించారు. ఇదే సమ‌యంలో ప్ర‌ధాన మంత్రి మోదీకి, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు, భార‌త ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉష‌కు లేఖ‌లు రాశారు బాధిత మ‌హిళ‌లు. ఏడుగురు స‌భ్యుల‌తో ఐఓసీ క‌మిటీ ఏర్పాటు చేసింది.

ఇదే స‌మంలో కేంద్రం రంగంలోకి దిగింది. విచార‌ణ పూర్త‌య్యేంత వ‌ర‌కు ఎలాంటి కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని ఆదేశించింది. కార్య‌ద‌ర్శిని కూడా స‌స్పెండ్ చేసింది.

Also Read : విచార‌ణ అయ్యేంత దాకా అన్నీ బంద్

Leave A Reply

Your Email Id will not be published!