హైదరాబాద్ : ఉప్పెన మూవీతో సంచలనం సృష్టించాడు దర్శకుడు బుచ్చిబాబు సన. తన కెరీర్ లో మరో కీలకమైన చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది . ఆ సినిమానే పెద్ది. ఇప్పటికే అంచనాలు మరింత పెంచేలా చేశాడు. గ్లింప్స్, పాటలు దుమ్ము రేపుతున్నాయి. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు. సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి ఈ సాంగ్స్. ఇక సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత అంతకు మించి అద్భుతమైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్. తనతో ముంబై అందాల సుందరి జాహ్నవి కపూర్ కీ రోల్ పోషిస్తోంది.
పెద్ది మూవీలో మరో ముఖ్యమైన పాత్ పోషించాడు కన్నడ సినీ పరిశ్రమలో టాప్ హీరో శివ రాజ్ కుమార్. సినిమాపై మరింత హోప్ పెంచేలా చేసింది. పెద్ది మూవీని ఆట నేపథ్యంలో తీర్చిదిద్దాడు. చాలా మంది ఫ్యాన్స్ ఈ సినిమా పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో తీస్తున్నారని అనుకుంటున్నారు. కానీ క్రికెట్ తో పాటు చాలా ఆటలను ఇందులో చిత్రీకరించినట్లు టాక్. ఇందులో ప్రధానంగా కుస్తీ కూడా ఉంది. రామ్ చరణ్ బర్త్ డే గ్లింప్స్ లో ‘కుస్తీ’ పై ఫోకస్ చేశారు దర్శకుడు బుచ్చిబాబు సన. ఇందులో రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, లుక్.. మరోసారి ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేశాయి. ఇప్పటి వరకూ చూడని చరణ్ ని బుచ్చిబాబు ప్రజెంట్ చేయబోతున్నాడన్న ధీమా మరోసారి కలిగింది. ఏప్రిల్ 30న ‘పెద్ది’ రిలీజ్ ఖాయమంటూ మరోసారి నిర్మాతలు ధైర్యంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.
