C P Radhakrishnan: గవర్నర్ పదవికి సి.పి.రాధాకృష్ణన్ రాజీనామా
గవర్నర్ పదవికి సి.పి.రాధాకృష్ణన్ రాజీనామా
C P Radhakrishnan : మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి సి.పి.రాధాకృష్ణన్ వైదొలిగారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో… గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు మహారాష్ట్ర గవర్నర్ గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు సి.పి.రాధాకృష్ణన్‌తో (C P Radhakrishnan) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేను ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో బుధవారం సి.పి.రాధాకృష్ణన్ కు సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… తాను రాజీపడని జాతీయవాదినని చెప్పారు. ‘‘గవర్నర్‌గా ఇక్కడ కొనసాగిన 13 నెలలు.. ప్రజాజీవితంలో సంతోషకరమైన సమయమని, పరిపాలన పరంగా, రాజకీయంగా నాకెంతో నేర్పిన రాష్ట్రమిది’’ అని పేర్కొన్నారు.
జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సి.పి.రాధాకృష్ణన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి బుధవారం నూతన ఉపరాష్ట్రపతిని కలిసి అభినందించారు.
C P Radhakrishnan – నేడు సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ (C P Radhakrishnan) ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం ఉదయం 9.30గంటలకు సీపీ రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో జరిగిన పోలింగ్‌లో బ్యాటెట్ పత్రాలనే ఉపయోగించారు. రెండో ప్రాధాన్యత ఓటు ఉండటం వల్ల ఈవీఎంలను వాడలేదు. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 కాగా ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగుకు దూరంగా బీఆర్‌ఎస్ (4రాజ్యసభ), బీజేడీ(7), శిరోమణి అకాలీదల్(3) దూరంగా ఉన్నాయి. దాంతో 767 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read : Terrorists: దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
