Carlos Alcaraz : యూఎస్ ఓపెన్ విజేతగా కార్లోస్
అతి పిన్న వయస్కుడిగా రికార్డ్
Carlos Alcaraz : స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్క రాజ్ అరుదైన ఘనత సాధించాడు. యూఎస్ ఓపెన్ టోర్నీ విజేతగా నిలిచాడు. ఈ ఘనతను సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరిన 19 ఏళ్ల అల్క రాజ్ నార్వేకి చెందిన కాస్పర్ రూడ్ తో పోటీ పడ్డాడు. ఇద్దరి మధ్య టైటిల్ కోసం హోరా హోరీగా తలపడ్డారు.
6-4, 2-6 , 7-6 తో ఘన విజయాన్ని నమోదు చేశారు కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz). ఈ గ్రాండ్ టైటిల్ సాధించడంతో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని పొందాడు.
ఇదిలా ఉండగా రఫెల్ నాదల్ 2005 సంవత్సరం తర్వాత 19 ఏళ్లకే మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన ఆటగాడిగా రికార్డు పుటలకు ఎక్కాడు కార్లోస్ అల్క రాజ్.
మరో వైపు ప్రతిష్టాత్మకమైన ఈ టైటిల్ కోసం జరిగిన పోరాటం ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. ఇరువురు ఆటగాళ్లు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు.
చివరి దాకా ఇద్దరూ శ్రమించారు. మ్యాచ్ పరంగా ఆద్యంతమూ ఉత్కంఠను రేపింది. ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి చూశారు ఎవరిని వరిస్తుందో విజయం అని. కార్లోస్ అల్క రాజ్ 6-4 తేడాతో మొదటి సెట్ గెలిచి ఆధిక్యంలోకి వచ్చాడు.
కాగా రెండో సెట్ లో రూడ్ సత్తా చాటాడు. ఎక్కడా అల్క రాజ్ కు ఛాన్స్ ఇవ్వలేదు. 6-2 తేడాతో రెండో సెట్ గెలిచాడు. దీంతో ఇరువురు చెరి సమానంగా ఉన్నారు.
మూడో సెట్ కీలకంగా మారింది. ఇద్దరూ ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ట్రై చేశారు. 7-1 తో అల్కరాజ్ విజయం సాధించాడు. చివరి నాలుగో సెట్ లో 6-3 తో ముందంజలో నిలవడంతో టైటిల్ వరించింది.
Also Read : సమిష్టి కృషికి సంకేతం శ్రీలంక విజయం